అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి. బస్ మలుపు తిరుగుతుండగా.. స్టీరింగ్ రాడ్ కట్ అవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. గాయాలైన వారు సమీపంలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు.