సాక్షి, రాజమండ్రి :ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే కొందరు సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. అటువంటి ఉల్లంఘనను అడ్డుకునే చర్యలను బుధవారం రాత్రి నుంచి సమైక్యవాదులు చేపట్టారు. జిల్లాలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను నిలువరించే చర్యలను జేఏసీ చేపట్టింది. ఉద్యోగ, ఆర్టీసీ జేఏసీలు, ఏపీ ఎన్‌జీఓలు ఇతర ఉపాధ్యాయ వర్గాలు రాత్రి హైదరాబాద్ వెళ్లే సర్వీసులను ఎక్కడికక్కడ నిలువరించారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల్లో జాతీయ, ఇతర ప్రధాన రహదారులపై బస్సులను అడ్డగించారు. బస్సుల టైర్లలో గాలి తీసేశారు.
సమైక్యవాదులై ఉండి సమైక్య ద్రోహులుగా వ్యవహరించ వద్దని హితవు పలికారు. జిల్లా నుంచి సుమారు 45 బస్సులు రోజూ హైదరాబాద్‌కు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఇవే కాకుండా వైజాగ్ నుంచి 25 బస్సులు రాజమండ్రి మీదుగా రాజధాని వెళుతున్నాయి. మరో 20 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి అనధికారికంగా తిప్పుతున్నట్టు తెలుస్తోంది. రోజుకు ఈ బస్సులు 3200 నుంచి 3600 మంది ప్రయాణికులను హైదరాబాద్ చేరవేస్తున్నాయి. సాధారణ రోజుల్లో బస్సు తరగతిని బట్టి రూ. 450 నుంచి రూ. 850 వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె కారణంగా రూ.850 నుంచి రూ.1200కి పైగా చార్జీ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.
ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా
Published Thu, Sep 26 2013 12:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement