
భీమేశ్వర్‌రావు( ఫైల్ ఫొటో)
సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండంలోని అలుబాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి టీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌రావును మావోయిస్టులు హతమార్చారు. అర్థరాత్రి ఇంట్లో నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. ఈ హత్యలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు కూబింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి ఉనికి తెలిపేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మావోయిస్టులు వదిలివెళ్లిన లేఖ, దాడికి ఉపయోగించిన కత్తి
Comments
Please login to add a commentAdd a comment