
సాక్షి, భువనేశ్వర్ : ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ గిరిజన యువకుడిని హత్య చేశారు మావోయిస్టులు. ఈ సంఘటన ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్కాన్‌గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామానికి చెందిన దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడు ఇన్‌ఫార్మర్‌గా ఉంటూ తమ విషయాలను పోలీసులకు చేరవేస్తున్నాడని మావోయిస్టులు భావించారు. ( 60 గంటలు దాటినా దొరకని దీక్షిత్ ఆచూకీ )
ఇటీవల భద్రతా బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందు పాతరల గురించి పోలీసులకు తెలియటం అతడి పనేనని వారు భావించారు. దీంతో అతడ్ని దారుణంగా హత్య చేశారు. అతడితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా గాయపరిచారు. ఈ ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment