tribal man
-
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
చర్ల: పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా బైరంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశముండిపారా గ్రామానికి చెందిన సోడి భద్రు(45) ఇంటికి ఆదివారం రాత్రి 7 గంటలకు వచ్చిన మావోయిస్టులు భద్రును బయటకు లాక్కొచ్చారు. అడ్డొచ్చిన భార్య, కుటుంబసభ్యులను పక్కకు నెట్టి ఇంటి ఆవరణలోనే గొడ్డలితో తల, నుదిటిపై నరికారు. దీంతో భద్రు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న బైరంఘడ్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బైరంఘడ్ తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. కాగా, పోలీస్ ఇన్ఫార్మర్గా మారి తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నందునే హతమార్చామని, ఇలా ఎవరు వ్యవహరించినా ఇదే శిక్ష పడుతుందని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ వదిలారు. -
దారుణం: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఓ గిరిజన వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని పోలీసుల తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద వైశ్య.. సింగ్రౌలీ ఎమ్మెల్యే రామ్ లల్లూ వైశ్య కుమారుడు. ఓ గిరిజన వ్యక్తిపై గురువారం కాల్పులు జరిపాడని ఆరోపణలు వచ్చాయి. రోడ్డుపై వెళ్తుండగా.. స్థానిక గిరిజనులతో వివేకానంద వైశ్యాకి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వైశ్య.. వారిని బెదిరించడానికి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ బుల్లెట్టు స్థానిక గిరిజనుని అరచేతికి తగిలినట్లు వెల్లడించారు. అనంతరం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం వివేకానంద వైశ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ కోసం రూ.10 వేల రివార్డు కూడా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటికొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే.. రామ్ లల్లూ వైశ్య.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. వివేక్ దోషి అని తేలితే శిక్షించండని చెప్పారు. బాధిత గిరిజనుడు తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిపిన ఆయన.. ఈ విషయం తెలిసి బాధేసిందని చెప్పారు. గత ఐదేళ్లుగా వివేక్ తన కుటుంబంతో కలిసి ఉండటం లేదని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ ఘటనలో నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. मध्य प्रदेश के भाजपा नेताओं में आदिवासी समुदाय पर अत्याचार करने की होड़ मची है। सीधी में आदिवासी युवक पर पेशाब करने की घटना को अभी ज्यादा समय नहीं हुआ है कि सिंगरौली में भाजपा विधायक रामलल्लू वैश्य के बेटे विवेकानंद वैश्य ने एक आदिवासी युवक को गोली मार दी। युवक गंभीर रूप से घायल… — Kamal Nath (@OfficeOfKNath) August 4, 2023 అయితే.. మధ్యప్రదేశ్‌లో వరుసగా గిరిజనులపై ఇలాంటి ఘటనలు జరగడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఫైరయ్యారు. గిరిజనులను, దళితులను పీడించడమే బీజేపీ పనా? అని ప్రశ్నించారు. నేరస్థులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుడిపై యూరినేషన్ ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పారు. దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: నా కారునే ఆపుతావా.. టోల్గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి -
మూత్ర విసర్జన ఘటన: గిరిజన యువకుని కాళ్లు కడిగిన సీఎం శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్‌లోని సిధి గిరిజన యువకునిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. సిధి జిల్లాలో రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిందితుడు ప్రవేశ్ శుక్లాగా గుర్తించిన పోలీసులు.. బుధవారం అతన్ని అరెస్టు చేశారు. తాజాగా మూత్ర విసర్జన ఘటనలో బాధితుడుడైన గిరిజన యువకుడి పాదాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కడిగారు. దశమత్ రావత్‌ను సీఎం గురువారం భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. అతన్ని ఓ కుర్చీలో కూర్చొబెట్టి సీఎం కింద కూర్చున్నారు. దళితుడి రెండు కాళ్లను ప్లేట్లో ఉంచి అతని పాదాలను నీళ్లతో కడిగారు శివరాజ్ సింగ్ చౌహన్. అనంతరం అతనికి బొట్టు పెట్టి పూలమాల వేసి శాలువతో సన్మానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆయనకు తినిపించి కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత.. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మూత్ర విసర్జన వీడియో చూసి తన మనసుకు బాధనిపించిందన్నారు.ఇందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ప్రజలు తనకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. అంతకుముందు ఈ ఘటనలో నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని సీఎం వెల్లడించారు. मेरे संज्ञान में सीधी जिले का एक वायरल वीडियो आया है... मैंने प्रशासन को निर्देश दिए हैं कि अपराधी को गिरफ्तार कर कड़ी से कड़ी कार्रवाई कर एनएसए भी लगाया जाए। — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 4, 2023 మరోవైపు నిందితుడు ప్రవేశ్ శుక్లా బీజేపీకి చెందినవాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ దళిత, గిరిజన ద్వేషానికి ఈ ఉదంతం అద్దం పడుతోందని కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా దుయ్యబట్టారు. బీజేపీ హయాంలో వారిపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయని రాహుల్ ఆరోపించారు. అయితే ఆ వ్యక్తితో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. దీనిపై విచారణకు నలుగురు వ్యక్తుల కమిటీ వేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించడం విశేషం. ఈ చర్య హీనమైనదని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. #WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal. In a viral video from Sidhi, accused Pravesh Shukla was seen urinating on Rawat. CM tells him, "...I was pained to see that video. I apologise to you.… pic.twitter.com/5il2c3QATP — ANI (@ANI) July 6, 2023 -
MP: గిరిజనుడి ఆవేదన.. సర్కార్‌పై పదివేల కోట్లకు దావా
తప్పుడు అభియోగాలతో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడతను. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఆ గిరిజనుడు ఊరుకోలేదు. న్యాయపోరాటానికి దిగాడు. ఏకంగా ప్రభుత్వాన్నే కోర్టుకు ఈడ్చాడు. ఫేక్ రేప్ కేసులో ఇరికించారని, జైలు శిక్ష అనుభవించేలా చేసి తన జీవితం నాశనం చేశారంటూ పరిహారం కోసం సర్కార్‌పై పదివేల కోట్ల రూపాయలకు దావావేశాడు. ఇండోర్: మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఓ గిరిజనుడు కోర్టుకు ఎక్కాడు. కంతూ అలియాస్ కంతూలాల్ బీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడనే ఆరోపణలతో జైలుకు పంపారు పోలీసులు. ఓ వివాహితను మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేశాడనే అభియోగం నమోదు అయ్యింది అతనిపై. అక్టోబర్ 2018లో నమోదు అయిన కేసు అది. డిసెంబర్ 23, 2020 నుంచి రెండేళ్లపాటు శిక్ష అనుభవించాడతను. సుమారు 666 రోజుల శిక్ష తర్వాత.. అతను అమాయకుడని తేలడంతో రిలీజ్ అయ్యాడు.అన్యాయంగా అత్యాచార అభియోగాలతో తనను రెండేళ్లపాటు జైల్లో ఉంచారంటూ ఆ సమయంలో వాపోయాడతను. అయితే.. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొవడం, జైలు శిక్ష తన జీవితాన్ని తలకిందులుగా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘దేవుడు ప్రసాదించిన జీవితంలో ఎన్నో విలువైన క్షణాలను దూరం చేసుకున్నా(ఉదాహరణకు శృంగార జీవితం)..’’ అంటూ పిటిషన్లో పేర్కొన్నాడతను. పరిహారంగా రూ. 10,006 కోట్ల రూపాయలకు అతను దావా వేసినట్లు తెలుస్తోంది. -
వీరశేఖర్‌పై పోలీసుల అరాచకం.. ఎస్సై లింగంపై వేటు
సాక్షి, సూర్యాపేట: రామోజీతండాకు చెందిన గిరిజన యువకుడిపై అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆత్మకూర్(ఎస్) మండలం ఎస్ఐపై సస్పెషన్ వేటు పడింది. దొంగతనం కేసు విచారణలో గిరిజన యువకుడు వీరశేఖర్‌ను చితకబాదిన ఎస్ఐ ఎం.లింగంపై పోలీసు ఉన్నతాధికారుల చర్యలు చేపట్టారు. ఎస్ఐ లింగంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సూర్యాపేట జిల్లాలో చేయని తప్పు ఒప్పుకోవాలంటూ గిరిజన యువకుడిని పోలీసులు తీవ్రంగా చితకబాదిన ఘటన బుధవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ యువకుడిని గోడ కుర్చీ వేయించారు.. ఆ యువకుడి మూత్రాన్ని అతడితోనే తాగించి రాక్షసానందం పొందారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆత్మకూరు(ఎస్) ఠాణా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: TSRTC: జర్నలిస్టులకు సజ్జనార్ గుడ్‌న్యూస్ కాగా ఇటీవల ఓ దొంగతనం కేసులో ఆత్మకూరు మండలంలోని రామోజీతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను బుధవారం అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. విచారణ పేరుతో వీర శేఖర్‌పై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఎస్సై లింగంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని చితకబాదారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు కాల్ చేసిన వీరశేఖర్‌ను తీసుకెళ్లాలని అన్నారు. దీంతో ఒంటిపై గాయాలతో ఉన్న శేఖర్‌ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. తరువాత వీరశేఖర్ బంధువులు ఆగ్రహంతో గురువారం ఆత్మకూర్.ఎస్ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. చదవండి: ఏడేళ్లుగా కేంద్రం నుంచి సహకారం లేదు: హరీశ్ రావు నడవలేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్‌పై తీసుకొచ్చి ఆందోళన చేశారు. దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా, వీరశేఖర్‌ను రోజంతా గోడకుర్చీ వేయించి కొట్టారని, బాధ్యులైన ఎస్సై, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా గిరిజన యువకుడు గుగులోతు వీరశేఖర్‌ను ఆత్మకూర్.ఎస్ పోలీస్‌స్టేషన్‌లో హింసించారన్న ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ తెలిపారు. -
ప్రధాని వస్తేనే టీకా తీసుకుంటా
ధార్: దేశవ్యాప్తంగా కోవిడ్–19 వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. నిత్యం లక్షలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే టీకా వేయించుకుంటానని ఓ గిరిజనుడు మొండికేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి ఇప్పుడు రావడం సాధ్యం కాదని, టీకా వేయించుకోవాలని అధికారులు చాలాసేపు ప్రాథేయపడినా అతడు ఒప్పుకోకపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని కికార్వస్ అనే గిరిజన గ్రామంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగింది? జిల్లా కేంద్రమైన ధార్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని కికార్వస్‌కు వ్యాక్సినేషన్ బృందం చేరుకుంది. గ్రామంలో 18 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకాలు వేయడం ప్రారంభించింది. ఓ గిరిజనుడికి టీకా వేసేందుకు ప్రయత్నించగా నిరాకరించాడు. ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిపించాలని పట్టుబట్టాడు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం)ను పిలిపించాలా? అని అడగ్గా.. కాదు, సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావాల్సిందేనని తేల్చిచెప్పాడు. చదవండి: (వ్యాక్సిన్ ఒక సురక్ష చక్రం) మోదీ వస్తే ఆయన సమక్షంలోనే టీకా తీసుకుంటానని స్పష్టం చేశాడు. ఇంతలో గ్రామంలో అర్హులకు టీకా వేయడం పూర్తయ్యింది. గిరిజనుడు, అతడి భార్య మాత్రమే మిగిలారు. టీకా తీసుకొనేందుకు వారు నిరాకరిస్తుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకున్నారు. మరోసారి గిరిజనుడి వద్దకు వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు ఇంటింటికీ తిరిగి అర్హులకు కరోనా టీకా వేస్తున్నారు. -
మందు పాతరల గుర్తింపు; యువకుడి హత్య
సాక్షి, భువనేశ్వర్ : ఇన్ఫార్మర్ నెపంతో ఓ గిరిజన యువకుడిని హత్య చేశారు మావోయిస్టులు. ఈ సంఘటన ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్కాన్‌గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామానికి చెందిన దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడు ఇన్ఫార్మర్గా ఉంటూ తమ విషయాలను పోలీసులకు చేరవేస్తున్నాడని మావోయిస్టులు భావించారు. ( 60 గంటలు దాటినా దొరకని దీక్షిత్ ఆచూకీ ) ఇటీవల భద్రతా బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందు పాతరల గురించి పోలీసులకు తెలియటం అతడి పనేనని వారు భావించారు. దీంతో అతడ్ని దారుణంగా హత్య చేశారు. అతడితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా గాయపరిచారు. ఈ ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. -
మూఢనమ్మకాలకు మరో ప్రాణం బలి
ప్రపంచం అంతా శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో దూసుకుపోతుంటే మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం నేటికీ మూఢనమ్మకాలను వీడడం లేదు. చిల్లంగి, దెయ్యం పట్టింది వంటి మూఢనమ్మకాలను గిరిజనులు నమ్ముతూనే ఉన్నారు. ఫలితంగా వారి అనుమానాలు హత్యకు దారి తీస్తున్నాయి. తాజాగా గుమ్మలక్ష్మీపురం మండలంలో చిల్లంగి పేరిట జరిగిన హత్యే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో మూఢనమ్మకానికి మరో ప్రాణం బలైంది. చిల్లంగి నెపంతో ఓ గిరిజనుడిని అతికిరాతకంగా రాళ్లతో కొట్టి చంపిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఎలి్వన్‌పేట సీఐ రమేష్‌కుమార్ విలేకరులకు బుధవారం వివరాలు వెల్లడించారు. మండలంలోని నెల్లికెక్కువ పంచాయతీ కొండకూనేరు గ్రామానికి చెందిన పల్లెరిక ప్రసాద్(23) అనే యువకుడు అనారోగ్యంతో ఈ నెల 11న మృతి చెందాడు. యువకుడి కుటుంబ సభ్యులు అదే రోజు అంత్యక్రియలు గ్రామంలో జరిపారు. అయితే ప్రసాద్ చిల్లంగి పెట్టడం వల్లే చనిపోయాడని, చిల్లంగి పెట్టింది అదే గ్రామానికి చెందిన పల్లెరుక మిన్నారావు అలియాస్ బారికి(46) అని కుటుంబ సభ్యులు అనుమానించారు. బారికిని ఎలాగైన మట్టుబెట్టాలని భావించిన ప్రసాద్ కుటుంబీకులు అదే రోజు మధ్యాహ్నం బారికి ఇంటికి వెళ్లి ప్రసాద్ మృతదేహం దహనమైందో..లేదో చూసి వద్దామని మాయమాటలు చెప్పి శ్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ రాళ్లతో అతి కిరాతకంగా కొట్టి చంపారు. అనంతరం బారికి మృతదేహాన్ని ప్రసాద్ అంత్యక్రియలు జరిగిన చోటే నిప్పు పెట్టి ఖననం చేసి ఇంటికొచ్చేశారు. తరువాత గ్రామంలో బారికి కనిపించకపోవడంతో పక్క గ్రామమైన డొంగరికెక్కువ గ్రామంలో నివసిస్తున్న బారికి మేనల్లుడు మండంగి వెంకటరావు పరిసర గ్రామాల్లో వెదికాడు. దీన్ని గమనించిన ప్రసాద్ బంధువు వెంకటరావు ఈ నెల 21న కొండకూనేరు గ్రామానికి పిలిపించి ప్రసాద్‌ను చిల్లంగి పెట్టి చంపినందునే బారికిని తాము చంపేశామని వెల్లడించారు. దీన్ని వివాదం చేయొద్దని పరిష్కరించుకుందామని వెంకటరావుతో మాట్లాడగా అందుకు నిరాకరించిన ఆయన ఎలి్వన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.నారాయణరావు ఆధ్వర్యంలో హెచ్‌సీ ఎన్.నాగేశ్వరరావు ఇతర సిబ్బంది గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. అనుమానితులైన 17 మందిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. కొండకూనేరులో బారికి ఒంటిరిగా జీవిస్తుండడంతో సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే 26న ఇదే మండలంలో డుమ్మంగి పంచాయతీ టెంకసింగి గ్రామంలో చిల్లంగి నెపంతో జరిగిన హత్యను మరువక ముందే మళ్లీ అటువంటి సంఘటనే పునరావృతం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
అడవి నుంచి అంతరిక్షానికి..!
చింతూరు: ఎంతో సాహసోపేతమైన అంతరిక్ష యాత్రకు వెళ్లేందుకు ఓ అడవిబిడ్డ ఆరాట పడుతున్నాడు. అంతరిక్షయానానికి వెళ్లడం ద్వారా దేశ, రాష్ట్ర కీర్తి ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు అతను ఉవ్విళ్లూరుతున్నాడు. దీనికోసం తనకు అనుమతితో పాటు ఆర్థికసాయం చేయాలని ఏడాదిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. మండలం కొత్తపల్లికి చెందిన దూబి భద్రయ్య మన రాష్ట్రం నుంచి ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి వ్యక్తిగా కీర్తి గడించాడు. ఆ స్ఫూర్తితో అతడు అంతరిక్ష యానానికి వెళ్లాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. గిరిబిడ్డలకు శిక్షణ 2016లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భద్రయ్య 2017–18లో 17 మంది గురుకుల విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణనివ్వడం ప్రారంభించాడు. భద్రయ్య శిక్షణలో రాటుదేలిన వారిలో వీఆర్ పురం మండలానికి చెందిన కుంజా దుర్గారావు, అడ్డతీగల మండలానికి చెందిన భానుప్రకాష్‌లు ఎవరెస్టును అధిరోహించారు. ప్రస్తుతం భద్రయ్య అరకు స్పోర్ట్స్ పాఠశాలలో స్పోర్ట్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు అంతరిక్షయానానికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి, ఆర్థికసాయం కోసం ప్రయతి్నస్తున్నాడు. గతంలో నాసా ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లిన మన దేశానికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్ఫూర్తితో తానుకూడా అంతరిక్ష యాత్ర చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు భద్రయ్య తెలిపాడు. గిరిబిడ్డల ప్రతిభను ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నానని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి అవకాశం కలి్పంచాలని అతను కోరాడు. ఈ మేరకు చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణను కలసి తన లక్ష్యాన్ని వివరించాడు. అంతరిక్షయానం నా స్వప్నం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సమయంలోనే అంతరిక్ష యాత్ర చేయాలని స్వప్నంగా పెట్టుకున్నా. ఇది ఆర్థికంగా, ప్రయాసతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వ సాయం కోసం వేచిచూస్తున్నా. ప్రభుత్వం ఆదుకుంటే గిరిబిడ్డల సత్తా ప్రపంచానికి చాటి చెబుతా. ఎవరెస్టు అధిరోహించిన సమయంలో గత ప్రభుత్వం రూ.10 లక్షలతో పాటు ఇల్లు ఇస్తామని చెప్పిన హామీ నేటికీ నెరవేరలేదు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. – దూబి భద్రయ్య కుటుంబ నేపథ్యమిది.. కొత్తపల్లికి చెందిన దూబి భీమయ్య, కన్నమ్మల ముగ్గురు సంతానంలో పెద్దవాడు దూబి భద్రయ్య. భార్య బుచ్చమ్మ గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. వ్యవసాయ కుటుంబంలో జని్మంచిన భద్రయ్య తొలి నుంచి పర్వతారోహణపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. ఎలాగైనా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుని 2016లో ఆ కల నెరవేర్చుకున్నాడు. -
కొంపముంచిన నిల్వ మాంసం
పాడేరు: రెండు రోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందిన మేకను కోసుకుతిన్న గిరిజనులు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఆస్వస్థతకు గురికాగా, వీరిలో ఓ గిరిజనుడు గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. హుకుంపేట మండలంలోని మారుమూల గన్నేరుపుట్టు పంచాయతీ డొంకినవలసలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామంలో రెండు రోజుల కిందట ఓ మేక అనారోగ్యంతో మృతిచెందడంతో బుధవారం దాన్ని కోసి, 15 కుటుంబాల వారు పంచుకుని వండుకుని తిన్నారు. గురువారం ఉదయం నుంచి వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. వీరిలో సుడిపల్లి వెంకటరమణ (43) అనే గిరిజనుడు గురువారం మధ్యాహ్నం 3గంటల సమయంలో గ్రామంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఉప్ప ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అనూష,ఇతర వైద్యసిబ్బంది సాయంత్రం అక్కడకు చేరుకుని 27 మంది గిరిజనులకు వైద్యసేవలు కలి్పంచారు. ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు అంబులెన్స్‌లను డొంకినవలస గ్రామానికి తరలించి,అక్కడ నుంచి రాత్రి 10గంటల సమయంలో పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు.ఈ 27 మందిలో పరిస్థితి విషమంగా ఉన్న 9 మందికి ఉన్నత వైద్యసేవలు కల్పిస్తున్నారు. మిగిలిన వారిని కూడా రాత్రికి తీసుకువచ్చారు.అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు డీఎస్పీ రాజ్కమల్లు ఆస్పత్రికి చేరుకుని బాధిత గిరిజనులను పరామర్శించారు. బాధిత గిరిజనులకు మెరుగైన వైద్యసేవలకు వైద్యులతో ఎమ్మెల్యే పాల్గుణ సమీక్షించారు. ఎంపీడీవోపై దాడి డొంకినవలస గ్రామంలో బాధిత గిరిజనులకు సహాయ కార్యక్రమాలకు గాను రాత్రి 7.30 గంటల సమయంలో తరలివెళ్లిన హుకుంపేట ఎంపీడీవో ఇమ్మానుయేల్, ఇతర సచివాలయ ఉద్యోగులపై సీపీఎం నేతలు, గిరిజనులు దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు. అధికారుల వాహనాల టైర్లకు గాలి కూడా తీసేసి వాహనాలను కదలనివ్వలేదు. ఈ దాడిలో ఎంపీడీవో ఇమ్మానుయేల్‌కు కుడిచేయి విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. అతి కష్టం మీద ఎంపీడీవో, ఇతర సిబ్బందిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఖండించారు. ఎంపీడీవోను కేజీహెచ్‌కు తరలించారు. -
చేతబడి చేశాడన్న అనుమానంతో..
పశ్చిమగోదావరి, వేలేరుపాడు: చేతబడి చేశాడన్న అనుమానంతో సోమవారం అర్ధరాత్రి వేలేరుపాడు మండలం రామవరం ఊటగుంపు గ్రామంలో కురసం సీతారాముడు(50)అనే గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామవరం ఊటగుంపు గ్రామానికి చెందిన సీతారాముడు చేతబడులు చేస్తాడని గ్రామస్తులకు కొన్నేళ్లుగా అనుమానం ఉంది. రెండు నెలల క్రితం అనారోగ్యంతో గ్రామంలోని ముచిక సురేష్, బందం జోగయ్య అనే ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. అయితే ముచిక సురేష్‌కు, సీతారాముడికి నిత్యం గొడవలు జరుగుతుండేవి. రెండు నెలల క్రితం ముచిక సురేష్ కామెర్ల వ్యాధితో మృతి చెందగా, ఇరవై రోజుల క్రితం బందం జోగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. జోగయ్య పెద్దకార్యం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆచారం ప్రకారం పెద్ద దినానికి పేతర కుండలు(ముంతలు) మహిళలు తీసుకెళ్లారు. కుండలు తీసుకెళ్లే మహిళలకు పూనకం వచ్చి సీతారాముడు చేతబడి చేయడం వల్లే ఇద్దరు గిరిజనులు మృతి చెందారని చెప్పడంతో గ్రామస్తులు మరింత కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న సీతారాముడిని సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. తనకే పాపం తెలియదని సీతారాముడు ఎంత ప్రాధేయపడినా వినకుండా గొంతు భాగంలో కత్తులతో నరికారు. దీంతో సీతారాముడు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కుక్కునూరు సీఐ బాలసురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడుగురు గ్రామస్తులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఏ కష్టమొచ్చిందో.. ఏమైందో..!
ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చిందో తెలియడం లేదు.. ఉపాధికి వచ్చి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తిరిగిరాని లోకాలకు చేరారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థల కారణంగా ఒకరిపై ఒకరు పంతానికి పోయి క్షణికావేశంలో పురుగుమందు తాగి.. పిల్లలచేత తాగించి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్నది అంతుచిక్కడం లేదు. భర్త, పిల్లలు మృతిచెందిన గది, పరిసరాల్లో ఇందుకు ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు. నోటి నుంచి నురగలు, దుర్వాసన వంటివి రాకపోవడంతో వీరు తీసుకున్న ఆహారం లేదా తాగునీరు విషతు ల్యమై ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. భార్య కొన ఊపిరితో కొట్టమిట్టాడుతూ విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటేనే అసలు విషయం వెలుగులోకి వస్తుందంటున్నారు. ఈ హృదయ విదారక సంఘటన శనివారం రాత్రి కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో చోటుచేసుకుంది. కె.కోటపాడు(మాడుగుల)/అనంతగిరి: కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పాటు భార్య ప్రాణాపాయ స్థితిలో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. చంద్రయ్యపేటలోని సబ్బవరపు కన్నంనాయుడుకు చెందిన కోళ్లఫారంలో అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బుడ్డిగరువుకు చెందిన పాంగి చిన్నోడు పనికి కుదిరాడు. భార్యా పిల్లలతో కలిసి ఆరు నెలల కిందట ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాడు. వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతోంది. దీంతో పాటు పిల్లల చదువు విషయంలో దంపతులు తరచూ తగాదా పడేవారు. ఈ క్రమంలో రోజూ మాదిరి శనివారం రాత్రి అంతా భోజనం చేసి నిద్రపోయారు. ఆదివారం ఉదయాన్నే వారు కోళ్లఫారంలో లేకపోవడాన్ని గమనించిన కన్నంనాయుడు వారుంటున్న గది వద్దకు వెళ్లి పిలిచాడు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా చిన్నారావు(30), ఆయన కుమారుడు సిద్ధు(6), కుమార్తె దీనా(3)లు మృతిచెంది ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో భార్య లక్ష్మి(25)కొట్టుమిట్టాడుతోంది. తలుపులను పెకలించి ఆమెను ఎకాయెకిన కె.కోటపాడు 30 పడకల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించాక విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కె.కోటపాడు పోలీసులకు సమాచారం అందించారు. చోడవరం సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్.ఐ ఎం.వీ.రమణలు సంఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. పురుగు మందు తాగి ఉంటారని తొలుత అనుమానించారు. వారుంటున్న గదితో పాటు సమీపంలో వెదికారు. పురుగు మందు అనవాళ్లు కనిపించలేదు. మృతుల నోటి వెంట ఎటువంటి నురగలు రాకపోవడాన్ని గుర్తించారు. దీనిపై చోడవరం సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విషం తీసుకోవడం లేదా విషాహారం తినడం వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి వారు తీసుకున్న ఆహరంతో పాటు నీటిని ల్యాబ్‌కు పరీక్షలకు పంపుతున్నామన్నారు. చోడవరం సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను చదివించాలన్నదే చిన్నారావు ఆశ చిన్నారావు ఎప్పుడూ కొడుకు సిద్ధును బాగా చదివించాలని ఆశపడేవాడు. అందుకే బుడ్డిగరువు నుంచి చంద్రయ్యపేట వచ్చి కోళ్లఫారంలో చేరానని అందరితో చెప్పేవాడు. చంద్రయ్యపేటలోని ప్రాథమిక పాఠశాలలో కొడుకును ఒకటో తరగతిలో చేర్పించాడు. భార్య లక్ష్మి స్వగ్రామం వెళ్ళిపొదామని భర్త చిన్నారావుతో పదేపదే అనేదని స్ధానికులు తెలిపారు. కుమారుడి చదువు మధ్యలో ఆపేయొద్దని ఈ ఏడాది పూర్తయ్యాక వెళ్లిపోదామని చిన్నారావు చెబుతుండేవాడని తెలిపారు. క్రిస్మస్ పండగకు చిన్నారావు భార్య, పిల్లలతో కలిసి బుడ్డిగరువు ఈ నెల 25న వెళ్లాడు. మళ్లీ 27న సాయంత్రం కుటుంభ సభ్యులతో కలిసి తిరిగి వచ్చాడు. వారు చనిపోయిన గదిలో తలవైపున బైబిల్ ఉంది. చిన్నారావు అందరితోనూ సరదాగా ఉండేవాడు. మర్యాదపూర్వకంగా మెలిగేవాడు. ఆదివాసీల ఆందోళన చిన్నారావు, పిల్లలు మృతిపై అతని తల్లిదండ్రులు లింగ న్న, వరహలమ్మలతో పాటు ఆ గ్రామానికి చెందిన గిరి జనులు అనుమానం వ్యక్తం చేశారు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారని, ఆర్థిక ఇబ్బందులు కుడా లేవని, కుమారుడి చదువు కోసం చిన్నారావు కుటుంబంతో చంద్రయ్యపేట వచ్చాడని తల్లి వరహలమ్మ విలేఖరులకు తెలిపింది. అటువంటిది కుమారుడు, మనుమలు మరణం పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపింది. ఇప్పుడు వృద్ధాప్యంలో తాము ఎలా బతకాలంటూ వారు రోదించడం స్ధానికులను కలిచివేసింది. ఈమేరకు మృతదేహాల ను పోస్టుమార్టానికి తరలించకుండా గిరిజనులు రోడ్డుపై మంటలు వేసి ఆదివారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మి పరిస్థితి విషమం పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెను అత్యవసర వైద్య విభాగంలో చేర్చి సేవలు అందిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యాధికారులంటున్నారు. -
పోలీసు లాఠీలకు ఓటరు బలి
మన్ననూర్ (అచ్చంపేట): పోలీసులు అత్యుత్సాహంతో చేసిన లాఠీచార్జిలో గాయపడిన ఓ గిరిజన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఉమామహేశ్వర కాలనీకి చెందిన చందూ నాయక్ (40) భార్య, ముగ్గురు పిల్లలతో కలసి హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు శుక్రవారం ఆయన కుటుంబంతో కలసి గ్రామానికి వచ్చాడు. ఆయన ఓటు వేసేందుకు ఉదయం పోలింగ్ కేంద్రానికి ఆయన వచ్చిన సమయంలో... గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొందని ఓ ప్రధాన పార్టీ నాయకుడు పోలీసులకు తప్పుడు సమాచారం చేరవేశాడు. దీంతో సీఐ లాఠీచార్జికి ఆదేశాలు జారీ చేయగా.. సివిల్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడ ఉన్నవారిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పోలీసులు సుమారు 20 మంది ఓటర్లను చితకబాదారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా చందూ నాయక్‌తో పాటు జెన్కో ఉద్యోగి వెంకటయ్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. చందూను ఆస్పత్రికి తరలించగా.. మూత్రపిండాలు దెబ్బతిన్నాయంటూ వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందాడు. -
బలరాముడికి మరో ఆహ్వానం
కొడంగల్ రూరల్ వికారాబాద్ : ఇటీవల మార్చి 18వ తేదీన ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సాధించిన బలరాం రాథోడ్‌కు ప్రస్తుతం ఆగస్టు 8వ తేదీన రష్యా దేశంలోని అతి ఎత్తైన ఎల్బ్రుస్ పర్వతం అధిరోహించడానికి ఆహ్వానం అందిందని బలరాం రాథోడ్ తెలిపారు. బొంరాస్‌పేట మండలం చిల్ముల్ మైలారం అనుబంధ గ్రామం సత్తార్కుంట తాండాకు చెందిన బలరాం రాథోడ్ 2017 నవంబర్ 16 నుండి డిశంబర్ 5వ తేదీ వరకు హిమాలయ మౌంటెన్ డార్జిలింగ్‌లో సముద్ర మట్టం నుండి 16,600 అడుగుల ఎత్తులోని రేణాక్ పర్వతం అధిరోహించి ‘ఏ’ గ్రేడ్ సర్టిఫెట్ అందుకున్నాడు. డిగ్రీ బీఎస్సీ (బీజెడ్సీ) పూర్తి చేసుకున్న బలరాం రాథోడ్ గతంలో రన్నింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ‘ఏ’ (ఆల్ఫా) గ్రేడ్ సర్టిఫికెట్ పొందిన బలరాం రాథోడ్ ప్రపంచంలోని ఏ పర్వతమైనా అధిరోహించేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మార్చి 18వ తేదీన సౌత్ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం అధిరోహించి రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆగస్టు 8వ తేదీ నుండి రష్యాలోని ఎల్బ్రుస్ పర్వతాన్ని అధిరోహించడానికి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన భువనగిరిలో రాక్ క్లైంబింగ్ సెలక్షన్స్ నిర్వహించారని అందులో తనతోపాటు మరో 5 మందిని సెలక్ట్ చేశారని తెలిపారు. ప్రస్తుతం భవనగిరిలో కోచ్ మాస్టర్ శేఖర్, మాస్టర్ పరమేష్కుమార్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటూ కొత్త వారికి శిక్షణ అందిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దాదాపు రూ.4 లక్షలకుపైగా ఖర్చు చేసుకుంటూ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించానని, ప్రస్తుతం దాతలు సహాయం చేసి రష్యాలోని ఎల్బ్రుస్ పర్వతాన్ని అధిరోహించేందుకు తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు రూప్లానాయక్ మేస్త్రీ పనులు చేసుకుంటూ అన్న రమేష్ రాథోడ్ ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ తనను ప్రోత్సహిస్తున్నారని, ఎల్బ్రుస్ పర్వతాన్ని ఎక్కడానికి దాతలు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని బలరాం రాథోడ్ కోరుతున్నారు. -
ఎస్సై ఓవరాక్షన్..
సాలూరురూరల్ (పాచిపెంట): పాచి పెంట ఎస్సై సన్యాసినాయుడు ఓవరాక్షన్ కారణంగా ఒక గిరిజనుడు ఆస్పత్రి పాలుకా గా, సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు.. మాతుమూరు గ్రామానికి చెందిన మరడ రవణమ్మకు కొండతాడూరులో కొంత భూమి ఉంది. ఈ భూమిలో గిరిజనులు, సీపీఎం నాయకులు ఆదివారం ఎర్రజెండాలు పాతారు. దీంతో విషయం తెలుసుకున్న రవణమ్మ తన భూమిలో జెండాలు పాతిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్సై సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న పశువుల కాపరి సుర్రు అప్పలస్వామి, స్థానికులు పొడిజన్ని లక్ష్మి, పొడిజన్ని సురేష్, తదితరులను విచారించారు. అయితే వీరు విషయం సక్రమంగా చెప్పకపోవడంతో పశువుల కాపరి అప్పలస్వామిని ఎస్సై కొట్టాడు. అప్పలస్వామి అపస్మారకస్థితికి చేరుకోవడంతో స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు. విధులకు అడ్డుతగిలారు.. ఇదిలా ఉంటే విచారణకు వెళ్లిన తమపై సుర్రు అప్పలస్వామి, పొడిజన్ని లక్ష్మి, పొడిజన్ని సురేష్, చింత సీతయ్యలు ఎదురుదాడికి దిగారని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎస్సై తీరు సరికాదు.. రాయిగుడ్డివలస సర్పంచ్ సీతయ్య విలేకరులతో మాట్లాడుతూ, బాధిత గిరిజనులకు అండగా నిలవాల్సిన ఎస్సై భూకామాంధులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపించారు. సీపీఎం నాయకులతో కలిసి గిరిజనులు ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు పాతారన్నారు. అయితే ఎస్సై భూకామాంధులకు ఒత్తాసు పలుకుతూ అభం..శుభం తెలియని పశువుల కాపరి అప్పలస్వామిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఎస్సై దాడిలో గాయపడిన అప్పలస్వామిని స్థానికులు సాలూరు సీహెచ్‌సీకి తరలించారని తెలిపారు. ఇదిలా ఉంటే సంఘటనా స్థలంలో లేకపోయినా, పరామర్శకు వచ్చాననే అక్కసుతో ఎస్సై తనపై కూడా కేసు నమోదు చేశాడని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవడంతో పాటు భూమిలేని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. -
క్షుద్ర పూజలకు మట్టి తీశాడని...
సాలూరు: క్షుద్ర పూజ జరిపేందుకు తన ఇంటి ముంగిట మట్టిని తీసుకువెళ్తున్న ఒడిశాకు చెందిన గిరిజన యువకుడ్ని పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించిన ఘటన సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కాలనీలో నివాసముంటున్న చుక్క వెంకటరమణ ఇంటి ముంగిట మట్టిని ఒడిశా రాష్ట్రం రాళ్లగడ్డ సమీపంలోని పుక్కిలి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు జయరాం తీసుకుని వెళుతుండగా అక్కడ వున్న మహిళలు అతడ్ని ప్రశ్నించారు. దీంతో ఆ యువకుడు తనను ఈ ఇంటి ముంగిట వున్న మట్టిని తీసుకురమ్మని రామా కాలనీకి చెందిన పల్లి వెంకటరావు పురమాయించాడని చెప్పినట్టు స్థానికులు తెలి పారు. ఆ మట్టి ఎందుకని ప్ర శ్నిస్తే పూజలు చేయడానికని ఆ యువకుడు బదులి వ్వడంతో దేహశుద్ది చేసి, పట్టణ పోలీసులకు అప్పగిం చా రు. ఇదిలా వుండగా చుక్క వెంకటరమణ కుటుం బానికి, పల్లి వెంటకరావు కుటుంబానికి వైరం నడుస్తుందని, అందుకే క్షుద్ర పూజలు జరిపించి, తమ కు టుంబాన్ని నాశనం చేసేందుకు వెంకటరావు కుట్ర ప న్నాడని వెంకటరమణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
గిరిజనుడి నుంచి భారీ నగదు స్వాధీనం
కొత్తగూడెం/బీజాపూర్: పెద్ద నోట్ల రద్దుతో సాధారణ ప్రజానీకంతో పాటు మావోయిస్టులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల మావోయిస్టుల తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవడానికి నానా తంటాలు పడుతుండగా.. తాజాగా చత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గిరిజన వ్యక్తి వద్ద నుంచి రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు డబ్బులు తీసుకెళ్తున్న ఓ గిరిజనుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బు మావోయిస్టులకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..
-
చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..
భువనేశ్వర్: చనిపోయిన తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు వాహనం అందుబాటులో లేక ఓ వ్యక్తి భుజాన వేసుకొని ఆస్పత్రి నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న తన ఊరుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ సమయంలో తన వెంట 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. వివరాల్లోకి వెళితే మేఘారా అనే గ్రామంలో దనమాజి(42), అమాంగ్ దేయి గిరిజన దంపతులు. గత కొద్ది కాలంగా అమాంగ్ క్షయ వ్యాధితో బాధపడుతోంది. వారికి ఒక కూతురు కూడా ఉంది. ఇటీవల ఆ వ్యాధి ముదరడంతో చికిత్స కోసం 60 కిలోమీటర్ల దూరంలోని భవానిపాట్నా ప్రభుత్వ ఆస్పత్రికొచ్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలువిడిచింది. అయితే, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మహాపారాయణ' అనే పథకం ప్రారంభించారు. దీని ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరుపున ఉచితంగా చేర్చడం ఈ పథకం ఉద్దేశం. కానీ దనమాజీ భార్యను తరలించేందుకు మాత్రం ఆస్పత్రి సహకరించలేదు. దీంతో తన భార్య మృతదేహాన్ని కొన్ని దుస్తుల్లో చుట్టి భుజాన వేసుకొని 60 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామానికి కూతురుతో సహా బయలుదేరాడు. అలా పది కిలో మీటర్లు నడిచి వెళ్లాక ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొని మిగితా 50 కిలోమీటర్లకు కలెక్టర్ వాహనం ఏర్పాటుచేశారు. ఘటనపై విచారణ జరిపి ఆస్పత్రి వర్గాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
బాలిక కిడ్నాప్.. తండ్రి హత్య!
కలహండి: ఒడీషాలోని కలహండి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పద్నాలుగేళ్ల గిరిజన బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. విడిపించడానికి వెళ్లిన తండ్రిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లాలోని సనచెరగావ్ గ్రామానికి చెందిన దయానిధి మాఝి(50) కూతురు ఈ నెల 22 నుంచి కనిపించకుండా పోయింది. కూతురు కోసం వెతుకుతున్న దయానిధి.. సోమవారం కిడ్నాప్ చేసిన దుండగులను గుర్తించి విడిపించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు దయానిధిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక జిల్లా అసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో దయానిధిని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం దయానిధి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి బాలిక కిడ్నాప్, తండ్రి హత్యలపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై దిలిప్ కుమార్ తెలిపాడు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
అక్రమ సంబంధముందని గొడ్డలితో నరికేశాడు
- ఒడిషాలో గిరిజనుడికి జీవితఖైదు బరిపాడ (ఒడిషా): అరవై ఏళ్ల తన బాబాయిని ముక్కలు ముక్కలుగా నరికేసి.. అతి కిరాతకంగా చంపిన ఓ వ్యక్తికి ఒడిషా కోర్టు జీవితఖైదు విధించింది. వితంతువైన తన కోడలితో బాబాయి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కారణంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో 35 ఏళ్ల నాగకిషోర్ నాయక్ కు మయూర్బంజ్ జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. మయూర్బంజ్ జిల్లా హాలాపూర్ గ్రామంలో నివసించే నాగకిషోర్ బాబాయి అయిన కునూ నాయక్(60)ను ఏప్రిల్ 27, 2011న గొడ్డలితో ముక్కలుముక్కలుగా నరికి చంపాడు. ఆ తర్వాత అతని చేతిని తీసుకొని వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వితంతువైన తన కోడలితో కునూ నాయక్ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడని, అందుకే తాను అతడిని చంపేశానని కిషోర్ నాయక్ కోర్టులో నేరాన్ని ఒప్పుకొన్నాడు. ఈ కేసులో మొత్తం 20మంది సాక్షులను విచారించిన కోర్టు నాగకిషోర్‌ను దోషిగా ప్రకటిస్తూ జీవిత ఖైదు, పదివేల రూపాయల జరిమానా విధించింది. -
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత
విశాఖ: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒక గిరిజన యువకుడిని మావోయిస్టులు మంగళవారం మధ్యాహ్నం కాల్చిచంపారు. విశాఖపట్టణం జిల్లా మున్సంగిపుట్టు మండలం బూసిపుట్టు గ్రామానికి చెందిన శివయ్య(25) అనే యువకుడిని కాల్చిచంపారు. సరియపుట్టు గ్రామ శివారులో శివయ్య వెళుతుండగా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మావోయిస్టులు కాల్చి హతమార్చారు. మావోలకు చెందిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో అతనిని చంపారని గ్రామస్తులు తెలిపారు.