బాలిక కిడ్నాప్.. తండ్రి హత్య! | Tribal man lynched by 'daughter's abductors | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్.. తండ్రి హత్య!

Published Wed, May 25 2016 2:04 PM | Last Updated on Mon, May 28 2018 1:37 PM

Tribal man lynched by 'daughter's abductors

కలహండి: ఒడీషాలోని కలహండి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పద్నాలుగేళ్ల గిరిజన బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. విడిపించడానికి వెళ్లిన తండ్రిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లాలోని సనచెరగావ్ గ్రామానికి చెందిన దయానిధి మాఝి(50) కూతురు ఈ నెల 22 నుంచి కనిపించకుండా పోయింది.

కూతురు కోసం వెతుకుతున్న దయానిధి.. సోమవారం కిడ్నాప్ చేసిన దుండగులను గుర్తించి విడిపించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు దయానిధిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక జిల్లా అసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో దయానిధిని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం దయానిధి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి బాలిక కిడ్నాప్, తండ్రి హత్యలపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై దిలిప్ కుమార్ తెలిపాడు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement