గిరిజనుడి నుంచి భారీ నగదు స్వాధీనం
కొత్తగూడెం/బీజాపూర్: పెద్ద నోట్ల రద్దుతో సాధారణ ప్రజానీకంతో పాటు మావోయిస్టులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల మావోయిస్టుల తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవడానికి నానా తంటాలు పడుతుండగా.. తాజాగా చత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గిరిజన వ్యక్తి వద్ద నుంచి రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు డబ్బులు తీసుకెళ్తున్న ఓ గిరిజనుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బు మావోయిస్టులకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.