దెబ్బతిన్న ట్రాక్‌కు గడ్డ కడుతున్న రైల్వే ఉద్యోగి
ముంబై : కుండపోత వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సబర్బన్ రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్బర్ సబర్బన్ మార్గంలో రైలు ట్రాక్ దెబ్బతినడంతో అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. అయితే, ఇందుకు ఓ క్లాత్ ముక్కను ఉపయోగించారు. రైల్వే ఉద్యోగులు దెబ్బతిన్న పట్టాలకు గుడ్డ ముక్కను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై సెంట్రల్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. హార్బర్ లైన్‌లోని గోవండి, మన్‌ఖుర్ద్ స్టేషన్ల పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో దెబ్బతిన్న ప్రదేశాన్ని గుర్తించేందుకు వర్షంలో పెయింట్ వేస్తే నిలవదు గనుక గుడ్డ ముక్కను వినియోగించినట్లు వివరించింది. అంతేగానీ గుడ్డ ముక్క కట్టి అదే పట్టాలపై రైలును పంపలేదని పేర్కొంది. ప్రయాణీకుల భద్రతే రైల్వేకు ముఖ్యమని తేల్చి చెప్పింది. కాగా, ఈ ఘటనపై విచారణ జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment