మహారాష్ట్రలోని ముంబై, పూణేలలో శనివారం అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ముంబైలోని దహిసర్ ప్రాంతంలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. రానున్న కొద్ది గంటల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్, ముంబై సహా ఇతర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది. అదే సమయంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్,దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఇంతలోనే పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ ఏడాది రుతుపవనాలు రెండు రోజులు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కేరళలో రుతుపవనాలకు ముందు విస్తృతంగా వర్షాలు కురిశాయి.
Comments
Please login to add a commentAdd a comment