మరో వివాదంలో పాక్ క్రికెటర్ | Umar Akmal and 4 other Pak players under probe for alleged involvement in brawl | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో పాక్ క్రికెటర్

Published Tue, Apr 26 2016 12:24 PM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

మరో వివాదంలో పాక్ క్రికెటర్ - Sakshi

మరో వివాదంలో పాక్ క్రికెటర్

కరాచీ:
థియేటర్లో జరిగిన ఓ ఘర్షణలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్తో పాటూ మరో నలుగురు జాతీయ స్థాయి క్రికెటర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. వివరాలు.. ఫైసలాబాద్ లోని ఓ థియేటర్ లో ఆదివారం రాత్రి జరిగిన డ్రామా షోకు అక్మల్, మరో నలుగురు క్రికెటర్లు హాజరయ్యారు. అయితే డ్రామాలో ఓ యువతి చేసిన నృత్యాన్ని మరోసారి చేయాలంటూ వీరు డిమాండ్ చేశారు. దీనికి థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో వారితో ఘర్షణకు దిగారు. ఈసంఘటన జరిగిన సమయంలో అక్మల్తో పాటూ క్రికెటర్లు అవాసిస్ జియా, బిల్ వాల్ బట్టి, మహ్మద్ నవాజ్, షాహిద్ యుసుఫ్లు ఉన్నారు.

దీనికి సంబంధించిన వీడియో పాక్ టీవీ చానళ్లలో చక్కర్లు కొట్టడంతో అక్మల్ వివరణ ఇచ్చుకున్నాడు. 'నా వ్యక్తిగత జీవతం వేరు, క్రికెట్ వేరు. అనవసరంగా చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. వినోదం కోసం మాత్రమే ఆ థియేటర్లో డ్రామా చూడటానికి వెళ్లాను.అదేం తప్పు కాదు. క్రికెటర్ వ్యక్తిగత జీవితాన్ని హైలెట్ చేసి చూడకూడదు' అని పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందుకూడా ఉమర్ అక్మల్ రెడ్ సిగ్నల్ పడినా.. దాటుకుని పోవడమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగి, వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement