ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
రంగారెడ్డి: ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని దండుమైలారం గ్రామానికి చెందిన బైండ్ల నర్సింహ(35) భార్య, బిడ్డలతో ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
కాగా, గురువారం సాయంత్రం నర్సింహ తన ఇంటి ముందు కుప్పకూలి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే చనిపోయాడు. మృత దేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.