
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వనందుకు ఓ యువతి వాచ్‌మన్‌ని చితకొట్టింది. ఈ సంఘటన చందానగర్‌లోని సిరి అపార్ట్‌మెంట్‌లో మంగళవారం చోటు చేసుకుంది. కారులో వచ్చిన ఓ యువతి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అనుమతి లేకుండా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లకూడదంటూ వాచ్‌మ్యాన్ ఆమెను అడ్డుకున్నాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి కారు దిగి వచ్చి వాచ్‌మన్ మీద విచక్షణారహితంగా దాడి చేసింది. పిడి గుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. అక్కడితో ఆగకుండా చెప్పుతో ఇష్టమొచ్చినట్టు కొట్టింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. (చదవండి: మద్యం మత్తులో యువతుల హల్‌చల్)
Comments
Please login to add a commentAdd a comment