అపార్టుమెంట్ పై నుంచి పడి వాచ్‌మన్ మృతి | watchman died in apartment | Sakshi
Sakshi News home page

అపార్టుమెంట్ పై నుంచి పడి వాచ్‌మన్ మృతి

Published Thu, Feb 26 2015 7:59 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

watchman died in apartment

అల్వాల్ (హైదరాబాద్ క్రైం): హైదరాబాద్ నగరం అల్వాల్‌లోని జేఏ ఆర్కేడ్‌లో అపార్టుమెంట్‌పై నుంచి పడి వాచ్‌మన్ మృతిచెందిన సంఘటన గురువారం జరిగింది. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం తణుకు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(40) పదిహేను రోజుల క్రితం జేఏ ఆర్కేడ్‌లో వాచ్‌మన్‌గా చేరాడు. ఈ క్రమంలో గురువారం అపార్టుమెంట్ పెంట్‌హౌజ్‌పై ఉన్న ట్యాంక్‌పైకి ఎక్కుతుండగా నిచ్చెనపై నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, వెంకటేశ్వర్లకు భార్య,  ఇద్దరు పిల్లలున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement