సల్మాన్ క్షమాపణ చెప్పలేదు.. | Salman Khan Sends Lawyer's Response, But No Apology, For Rape Remark | Sakshi
Sakshi News home page

సల్మాన్ క్షమాపణ చెప్పలేదు..

Published Wed, Jun 29 2016 2:24 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

సల్మాన్ క్షమాపణ చెప్పలేదు.. - Sakshi

సల్మాన్ క్షమాపణ చెప్పలేదు..

రేప్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ పంపిన నోటీసులకు ప్రముఖ సినీనటుడు సల్మాన్ ఖాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులకు  సమాధానం పంపారు. నోటీసుపై స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం రేప్ వ్యాఖ్యలపై సల్మాన్ క్షమాపణ చెప్పలేదని తెలిపారు. మిగతా వివరాలను పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

వచ్చే నెలలో విడుదల కాబోతున్న సల్మాన్ కొత్త సినిమా 'సుల్తాన్' సినిమా గురించి ఇచ్చిన ఇంటర్వూలో సినిమాకు తాను చేసిన కసరత్తుల వల్ల రేప్ కు గురైన మహిళల తన శరీరం తయారైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు సల్మాన్ ను సమర్ధించగా, మరికొందరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సల్మాన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ క్షమాపణ చెప్పాలని గతంలో కోరింది. ఈ మేరకు నోటీసులు పంపగా, సల్మాన్ తన లాయర్ ద్వారా తిరిగి మహిళాకమిషన్ నోటీసులను పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement