deny
-
అంబులెన్స్‌లను ఆపడం విజ్ఞతేనా?
హైదరాబాద్, చుట్టుపక్కల కాని, తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కాని పలుమార్లు చెబుతుంటారు. ఆంధ్రా ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, ఇలా అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం వంటి ఘట్టాలు జరిగినప్పుడు పాత గాయాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య వైమనస్యాలు పెంచే విధంగా సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపిన తీరు ప్రభుత్వంపై అసంతృప్తికి దారి తీసింది. దానివల్ల మళ్లీ రెండు ప్రాంతాలవారి మధ్య వైషమ్యాలు పెచ్చరిల్లవచ్చు. కరోనా సంక్షోభంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, కేసీఆర్ వంటి నేతలు రాజనీతిజ్ఞతను ప్రదర్శించవలసి ఉంటుంది. ఒక నాయకుడు చేసే తప్పు ప్రజలకు ఎంత అనర్థంగా మారుతుందో చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అవుతుంది. 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి పార్లమెంటు చట్టం చేసింది. దాని ప్రకారం 2024 వరకు హైదరాబాద్ తెలంగాణతో పాటు ఏపీకి కూడా రాజధానిగా కొనసాగవచ్చు. కాని ఆ అవకాశాన్ని ఆనాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేజేతులారా వదులుకుంది. దాని విపరిణామాలను ఆంధ్రా ప్రజలు అనుభవించవలసిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. కరోనా సంక్షోభం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతుందని ఎవరైనా ఊహించగలరా? కరోనా బారిన పడినవారు హైదరాబాద్‌లో అయితే మరింత మంచి వైద్యం లభిస్తుందన్న నమ్మకమో, లేక వారికి ఉన్న పరిచయాల రీత్యా హైదరాబాద్ బెటర్ అనుకునో అంబులెన్స్‌ల ద్వారా ట్రీట్మెంట్ కోసం వస్తుంటే తెలంగాణ పోలీసులు వాటిని నిలుపుదల చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా ఇది మంచి పద్ధతి కాదని, మానవత్వంతో వ్యవహరించాలని సూచించింది. అయినా మే 14వ తేదీన మళ్లీ తెలంగాణ పోలీసులు ఆయా సరిహద్దులలో ఏపీ అంబులెన్స్‌లను ఆపివేశారు. ఆయా చోట్ల ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడినా ప్రయోజనం దక్కలేదు. ఏపీ అధికారులు తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరుపవలసి వచ్చింది. అలాగే రాజకీయపరంగా కూడా తెలంగాణ నేతలతో ఏపీ నేతలు మాట్లాడారు. చివరికి హైకోర్టు తలుపు తడితే కానీ అంబులెన్స్‌లకు దారి వదలలేదు. హైకోర్టు వారు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఎందుకు ఏపీ అంబులెన్స్‌లను నిలుపుదల చేస్తున్నారు? దానికి ఒకటే కారణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో అనేక ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా బాధితులతో బెడ్స్ అన్నీ నిండిపోయాయి. దాంతో కొత్త పేషంట్లు వచ్చినా చేర్చుకునే పరిస్థితి కనిపిం చడం లేదు. ఏపీ వారు కాబట్టి సహజంగానే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకపోవచ్చు. అసలే హైదరాబాద్‌లో బెడ్స్ రద్దీ ఏర్పడితే, పొరుగు రాష్ట్రాల బాధితులు కూడా ఇక్కడకే వస్తే, తెలంగాణలో కరోనా బారినపడ్డ బాధితులకు బెడ్స్ దొరకవన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన కావచ్చు. అయినప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చేవారిని అనుమతించక తప్పదు. రాష్ట్రాల సరిహద్దులను మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అలాగే మిగిలిన రాష్ట్రాలకు, ఏపీకి తేడా ఉంది. ఏపీ ప్రజలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. మొదటి వేవ్ సమయంలో కొన్ని వేల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు. అప్పుడు సరిహద్దులు మూసివేయడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏపీలోకి అనుమతించారు. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు. ప్రస్తుతం అంబులెన్స్‌లనే నిరోధిస్తున్నారు. దీనివల్ల కొందరు బాధితులు అంబులెన్స్లలోనే ప్రాణాలు కోల్పోవడం వంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. గతంలో సాగర్ వద్ద కూడా రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగిన తోపులాట ఆందోళన కలిగించింది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఆయా సంస్థల విభజన పూర్తి కాలేదు. ఆస్తుల పంపిణీ జరగడం లేదు. వీటన్నిటికి మూలం ఏమిటి? పదేళ్ల ఉమ్మడి రాజధానిని ఎవరు, ఎందుకు వదులుకున్నారు? వీటన్నిటికీ ఒకటే కారణం కనిపిస్తుంది. 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చడానికి ప్రయత్నించారన్నది అప్పట్లో వచ్చిన అభియోగం. ఆ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి టీడీపీని గెలిపించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అది ఎలాగో కేసీఆర్‌కు తెలిసిపోయింది. ఆయన తెలివిగా, వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వచ్చిన ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పట్టుకుని అరెస్టు చేశారు. అదే తరుణంలో ఈ కేసులో చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఒక ఆడియో సాక్ష్యం కూడా దొరికింది. దాంతో చిక్కుల్లో పడ్డ చంద్రబాబు అప్పట్లో తన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పెద్దల ద్వారా కేసీఆర్‌తో రాజీ చేయించుకున్నారు. అప్పుడు చంద్రబాబు హైదరాబాద్‌ను వీడి ఏపీకి వెళ్లిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కండిషన్ పెట్టారని అంటారు. దాంతో చంద్రబాబు రాత్రికి, రాత్రే తట్టా, బుట్టా సర్దుకుని విజయవాడ వెళ్లిపోయారు. అక్కడ ఒక్క వసతి లేకపోయినా, అతిథి గృహాలలో ఉంటూనో, ఐదు కోట్ల రూపాయల విలువైన బస్‌లో గడుపుతోనో పాలన సాగించారు. పైగా దానికి ఒక బిల్డప్ కూడా ఇచ్చారు. ఏపీ ప్రజలకు దగ్గరగా ఉండడం కోసమే ఏపీకి వెళ్లానని అబద్ధాలు ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత తాత్కాలిక నిర్మాణాలు చేసి సచివాలయాన్ని తరలించారు. ఆ రకంగా హైదరాబాద్‌పై ఏపీ ప్రజలకు ఉన్న హక్కులను వదులుకున్నారు. నిజానికి అప్పట్లో మా బోటివాళ్లం ఏపీ ప్రజలకు హైదరాబాద్‌లో విద్య, వైద్యం, ఉపాధి, నివాస హక్కులు ఉండేలా ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టంగా వాదించేవారం. ఆ హక్కుల సంగతేమో కానీ, ఉన్న హక్కు కూడా వదులుకుని ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాం. ఏపీలో సరైన సదుపాయాలు ఇంకా అభివృద్ధి కాలేదు. అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న సదుపాయాలను ఆంధ్ర నుంచి వచ్చేవారు వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం షరతులు పెడుతోంది. ఇలా ఆయా సందర్భాలలో జరిగే పరిస్థితి రావడం బాధాకరం. హైదరాబాద్, చుట్టుపక్కల కాని, తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడ్డ ఆం్ర«ధా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కాని పలుమార్లు చెబుతుంటారు. ఆంధ్రా ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, ఇలా అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం వంటి ఘట్టాలు జరిగినప్పుడు పాత గాయాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్లీ రెండు ప్రాంతాలవారి మధ్య వైషమ్యాలు పెచ్చరిల్ల్ల వచ్చు. అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ఒక పరిష్కారం కనుగొని ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలి. ఇది ఆయన బాధ్యత కూడా. దానిని ఆయన విస్మరిస్తే రాజకీయంగా కూడా అది నష్టం చేస్తుంది. ఆ విషయం ఆయనకు తెలియదని అనలేం. ఉదాహరణకు 2018 శాసనసభ ఎన్నికలలో కాని, ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో కాని సెటిలర్లు మెజార్టీ టీఆర్ఎస్కే ఓటు వేశారు. ఆంధ్ర రాజకీయాల ప్రభావంతో టీడీపీతో కలిసిన కాంగ్రెస్‌కు జనం ఓట్లు వేయలేదు. అలాగే ఇటీవలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కూకట్ పల్లి, శేరీలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాలలోని డివిజన్లలో టీఆర్ఎస్ అత్యధికంగా గెలిచింది. అక్కడి సెటిలర్లు టీఆర్ఎస్కు ఓటువేయడమే కారణం. ఆ విషయాలను టీఆర్ఎస్ విస్మరించరాదు. అనూహ్యంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వైమనస్యాలు పెంచే విధంగా సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపిన తీరు ప్రభుత్వంపై అసంతృప్తి్తకి దారి తీసింది. కానీ చిత్రం ఏమిటంటే ప్రతిదానికీ స్పందించే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అంబులెన్స్‌లను సరిహద్దులలో ఆపడాన్ని ఖండించకపోవడం కూడా అంతా గమనించారు. ఏది ఏమైనా కరోనా సంక్షోభంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు , కేసీఆర్ వంటి నేతలు రాజనీతిజ్ఞతను ప్రదర్శించవలసి ఉంటుంది. మరోసారి ఇలాంటివి జరగరాదని ఆశిద్దాం. వ్యాసకర్త : కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
‘అవినీతి’ వివరాలకు పీఎంఓ నో
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల సమాచారాన్ని వెల్లడించడానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నిరాకరించింది. ఆ వివరాలు అంతర్గతమని, వాటిని బహిర్గతపర్చడం పెద్ద కసరత్తు అని బదులిచ్చింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌధరిపై సీబీఐ ఉన్నతాధికారి ఒకరు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీఎంఓ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులపై అప్పుడప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది ఆర్టీఐ కింద దాఖలుచేసిన అర్జీకి సమాధానంగా చెప్పింది. -
సల్మాన్ క్షమాపణ చెప్పలేదు..
రేప్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ పంపిన నోటీసులకు ప్రముఖ సినీనటుడు సల్మాన్ ఖాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులకు సమాధానం పంపారు. నోటీసుపై స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం రేప్ వ్యాఖ్యలపై సల్మాన్ క్షమాపణ చెప్పలేదని తెలిపారు. మిగతా వివరాలను పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న సల్మాన్ కొత్త సినిమా 'సుల్తాన్' సినిమా గురించి ఇచ్చిన ఇంటర్వూలో సినిమాకు తాను చేసిన కసరత్తుల వల్ల రేప్ కు గురైన మహిళల తన శరీరం తయారైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు సల్మాన్ ను సమర్ధించగా, మరికొందరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సల్మాన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ క్షమాపణ చెప్పాలని గతంలో కోరింది. ఈ మేరకు నోటీసులు పంపగా, సల్మాన్ తన లాయర్ ద్వారా తిరిగి మహిళాకమిషన్ నోటీసులను పంపించారు. -
100 మంది ఎమ్మెల్యేలకు మొండిచేయి!
న్యూఢిల్లీ: 2017లో ఉత్తరప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు తమ అభ్యర్ధిత్వాన్ని కోల్పోనున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో ఉద్వాసన పలకడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 403 నియోజకవర్గాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీకి 229 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభకు ఎన్నికలు ముగిసిన తర్వాత క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై పార్టీ వేటు వేసింది. అంతేకాకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ఉన్నవారికి ఎన్నికల్లో సీట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు పార్టీకి చెందిన ఓ కీలక నేత తెలిపారు. సీఎం అఖిలేష్ యాదవ్ పై ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నా.. ఎమ్మెల్యేలపై ఎక్కువగా ఉందని వివరించారు. వ్యతిరేకత ఉన్నవారికి టికెట్లు ఇవ్వకపోవడమే మంచి పని అన్నారు. కాగా, పార్టీ తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని పార్టీలోని మరికొంత మంది గాబరా పడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టిన సమాజ్ వాదీ పార్టీ ప్రత్యర్థులు చేసిన సభ్యులను ఖరారు చేసిన స్థానాల్లో 150 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగతా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఎస్పీ చీఫ్ ములాయాం సింగ్ యాదవ్ నియోజకవర్గాల నుంచి నాయకుల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. కాగా, ములాయాం ఎంపిక చేసిన అభ్యర్థులకే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
సమ్మె విరమించేది లేదు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరిస్తామంటూ కోర్టుకిచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కాబట్టి సమ్మె యథాతథంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు హైకోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం జూడాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, కాలేజీల్లో బోధనా సిబ్బంది కోసం సమ్మె చేస్తున్నామని చెబుతున్న జూనియర్ డాక్టర్లలో... రేపు చదువు ముగిసిన తర్వాత అత్యధిక శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయరని, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే పనిచేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించింది. వైద్య సేవలందక రోగులు ఇబ్బందులు పడుతుంటే వారి పట్ల దయ చూపకుంటే ఎలా అంటూ నిలదీసింది. సమ్మెను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని జూడాలను ఆదేశించింది. దీంతో వారి తరఫు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలు మార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కోర్టులపై నమ్మకం లేదా? కేసు విచారణకు రాగానే జూడాల సమ్మెపై వారి న్యాయవాది రవిచందర్‌ను ధర్మాసనం ఆరా తీసింది. సమ్మె విరమించలేదని, తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని రవిచందర్ తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘జూడాలు సమ్మె విరమించకుంటే, మేం ఈ కేసును విచారించే ప్రసక్తే లేదు. అయినా కోర్టును ఆశ్రయించకుండా ప్రభుత్వం వద్దకు వెళ్లడం ఏమిటి? కోర్టుల మీద వారికి నమ్మకం లేదా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చు. అయితే ఆ ప్రవర్తన చట్టబద్ధంగా ఉండాలి. అర్ధగంట సమయం ఇస్తున్నాం. వారితో చర్చించి సమ్మె విరమించి, విధుల్లో చేరమని చెప్పండి’’ అని రవిచందర్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఆయన కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చి జూడాలతో చర్చలు జరిపారు. అరగంట తరువాత తిరిగి 12 గంటలకు విచారణ ప్రారంభం కాగా... సమ్మె విరమింప చేసేందుకు తాను ప్రయత్నించానని, అయితే అందుకు జూనియర్ డాక్టర్లు ఆసక్తి చూపడం లేదని రవిచందర్ కోర్టుకు నివేదించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ... అయితే సమ్మెను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని, ఆ దిశగా వాదనలు వినిపించాలని స్పష్టంచేసింది. ఇదే సమయంలో జూడాల సమ్మెపై ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించింది. సమ్మె చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. సమ్మె విరమించకపోతే చర్యలు: టి.రాజయ్య సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జూని యర్ డాక్టర్లు సమ్మె విరమించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుం దని మంత్రి టి.రాజయ్య పేర్కొన్నా రు. జూడాల విషయంలో ప్రభుత్వం కోర్టు తీర్పు ప్రకారం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. బుధవా రం ఆయన నిజామాబాద్‌లో మంత్రి పోచారంతో కలసి మాట్లాడారు. రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని, కొందరు ప్రైవేటు డాక్టర్లు చేస్తున్న తప్పుడు ప్రచారమని కొట్టి పడేశారు. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో 465 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ‘గిరి’ మరణాలకు వారి అనాగరికతే కారణం.. ఆదిలాబాద్: గిరిజనుల మరణాలకు వారి అనాగరికతే కారణమని రాజయ్య వ్యాఖ్యానించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన అటవీ మంత్రి జోగు రామన్న తో కలసి మాట్లాడారు. ‘ఏజెన్సీలో మూఢనమ్మకాలు.. అనాగరికత.. బాల్య వివాహాలు.. మేనరికపు పెళ్లిళ్లు.. సాంఘిక రుగ్మతలతో మరణాల బారిన పడుతున్నారు. ఈ మరణాలను అరికట్టేందుకు ఏజెన్సీలో వైద్యశిబిరాలతోపాటు, అవగాహనకార్యక్రమాలు చేపడతామన్నారు. ధర్నాచౌక్‌లో జూడాల నిరసనల హోరు హైదరాబాద్ : నెల రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు రోజు రోజుకి తమ నిరసనల హోరు పెంచుతున్నారు. ప్రభుత్వం తమ వాదనలు వినాలని, సమస్యలను పరిష్కరించాలని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో తాము తప్పకుండా పనిచేస్తామని, అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్‌లో జూడాలు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రికి 830 మంది జూనియర్ డాక్టర్లు ఉత్తరాలు రాశారు. జూనియర్ డాక్టర్లు అంకిత్ రెడ్డి, ప్రేమ్‌రాజ్, భరత్, సతీష్, హరిప్రియ, రంజిత్, నిఖిల తదితరులు దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూడాల అసోసియేషన్ కన్వీనర్ శ్రీనివాస్, అధ్యక్షుడు క్రాంతి, అధికార ప్రతి నిధులు స్వప్నిక, నరేష్, భాను, అనిల్, సాయికుమార్, అనిల్ పాల్గొన్నారు. కాగా జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతంలో సర్వీసు చేస్తామని స్పష్టం గా చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తోందని బీజేపీ శాసన సభ పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం నాటి రిలే దీక్షలకు ఆయున హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి జూడాలను చర్చలకు పిలవాలని ఆయన కోరారు.