ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన వ్యాపారవేత్త హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆ కేసుకి సంబంధించి ప్రధాన నిందితురాలు 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్‌తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బల్జీత్ లాడ్జిలో తన గదిలో నురగలు కక్కుతూ శవమై కనిపించిన వ్యాపరవేత్త దీపక్ సేథీని హనీట్రాప్ ప్లాన్‌తోనే హత్య చేసినట్లు తెలిపారు. సదరు మహిళ పేరు ఉషా అని ఆమె నిక్కీ, అంజలి, నిఖిత వంటి మారుపేర్లతో వ్యక్తులతో స్నేహం చేసి వారిని హోటళ్లుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోచుకునేదని చెప్పారు.
ఈ ప్లాన్‌తోనే ఆ రోజు కూడా ఉషా దీపక్ సేథీని ట్రాప్ చేసి హోటల్‌ల్‌కి తీసుకువెళ్లిందన్నారు. ఐతే ఆరోజు అనుకోకుండా ఓవర్ డోస్ అవ్వడంతో అతను మృతి చెందాడని తెలిపారు. దీపక్ సేథీ(53) మార్చి 30న రాత్రి 9.30 గంటలకు ఉషతో కలిసి గెస్ట్‌హౌస్‌కి వెళ్లిందని, అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో డబ్బు, నగలతో బయటకు వచ్చినట్లు తెలిపారు. ఐతే అనుకోకుండా దీపక్ చనిపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేస్తూ.. 'సారీ అంటూ నోట్' రాసిందన్నారు. అదే ఆమెను పోలీసులకు పట్టించేలా చేసిందని చెప్పారు. ఈ ఘటనలో బాధితుడిని సంప్రదించిన ఫోన్ నెంబర్లలో ప్రధాన నిందితురాలితో సహా ఉన్న కొనఇన అనుమానిత నంబర్లను కూడా గుర్తించారు పోలీసులు.
నిందితురాలు ఉష నెంబర్ సంత్‌గఢ్ ప్రాంతంలో రీఛార్జ్ అవ్వడంతో ఆ లోకేషన్‌ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని నైజరియన్ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతడి లివ్‌ఇన్ భాగస్వామీ మధుమిత స్నేహితురాలి నిక్కీ అలీయాస్ ఉషా అని తేలడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆమె 2022లో పానిపట్‌లో నమోదైన కేసులో జైలులో ఉంది. అక్కడే మధుమితతో పరిచయం ఏర్పడిందని, ఆమె దీపక్ సేథీని ఉషకు పరిచయం చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితురాలు ఉషా తనకు దీపక్ సేథీని చంపే ఉద్దేశ్యం లేదని, అందువల్లే ఆ గది నుంచి బయటకు వెళ్లే ముందు సారీ నోట్‌ని వదిలి వెళ్లినట్లు తెలిపింది. అలాగే ఆమె సేథీ నుంచి తీసుకున్న మొబైల్ ఫోన్, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
(చదవండి: బార్‌లో సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం..పదిమంది అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment