కోహ్లి సారీ.. ఎందుకో తెలుసా? | Virat Kohli says sorry to Royal Challengers fans after dismal season | Sakshi
Sakshi News home page

కోహ్లి సారీ.. ఎందుకో తెలుసా?

Published Mon, May 8 2017 10:40 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

కోహ్లి సారీ.. ఎందుకో తెలుసా?

కోహ్లి సారీ.. ఎందుకో తెలుసా?

బెంగళూరు: ఐపీఎల్‌ 10లో చెత్త ప్రదర్శన చేసినందుకు క్రికెట్‌ అభిమానులకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్షమాపణ చెప్పాడు. అంచనాలకు తగ్గినట్టు ఆడడంలో విఫలమయ్యామని, అభిమానులను నిరాశకు గురి చేశామని పేర్కొన్నాడు. ‘మాపై అంతులేని ప్రేమ కురిపించి వెన్నంటి నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మేము స్థాయికి తగినట్టు ఆడలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాన’ని కోహ్లి ట్వీట్‌ చేశాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓడింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ఈ సీజన్‌ను త్వరగా మర్చిపోవాలకుంటున్నట్టు చెప్పాడు. ఐపీఎల్‌-10లో తమకు ఏదీ కలిసి రాలేదని వాపోయాడు. బ్యాటింగ్‌లో రాణిస్తే బౌలింగ్‌లో విఫలమయ్యామని, ఇలా రెండిట్లో డీలా పడ్డామని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే ప్లేఆఫ్‌ నుంచి వైదొలగిన కోహ్లి సేన 5 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. 10 మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఈనెల 14న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement