కోహ్లీ చేతిలో ఆ బుజ్జాయి ఎవరో తెలుసా..! | Virat Kohli selfie with a baby goes viral | Sakshi
Sakshi News home page

కోహ్లీ చేతిలో ఆ బుజ్జాయి ఎవరో తెలుసా..!

Published Tue, May 2 2017 12:00 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

కోహ్లీ చేతిలో ఆ బుజ్జాయి ఎవరో తెలుసా..!

కోహ్లీ చేతిలో ఆ బుజ్జాయి ఎవరో తెలుసా..!

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ పాపతో దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటో కొన్ని నిమిషాల్లోనే  లక్షల లైక్స్, వేల కామెంట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్-10 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. అయితే కాస్త ఆటవిడుపు కోరుకున్నాడో ఏమో.. టీమిండియా సహచరుడు, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హర్బజన్ కూతురు హినయతో కబుర్లు చెబుతూ సెల్ఫీలు దిగాడు కోహ్లీ.

చిన్నారి ముద్దుముద్దు మాటలతో టెన్షన్ నుంచి కాస్త ఊరట పొంది ఉంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'చిన్నారులు ఎంతో క్యూట్‌గా, అందంగా ఉంటారు. ఇక్కడ చూడండి.. బేబీ హినయ నా గడ్డంలో ఏదో వెతుకుతుంది. హర్బజన్, గీతాబస్రా దంపతులకు దేవుడు అంతా మంచి జరిగేలా చూడాలి' అని తన పోస్ట్‌లో కోహ్లీ రాసుకొచ్చాడు. గత మార్చి నెలలో ఎంఎస్ ధోనీ కూతురు జీవాతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేయగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు నిన్న (సోమవారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement