కస్టమర్ రిక్వెస్ట్‌.. జొమాటోలో కొత్త ఫీచర్ | Zomato Introduces New Feature Of Delete Order In Response To Customer Request, More Details Inside | Sakshi
Sakshi News home page

Zomato Delete Order Feature: కస్టమర్ రిక్వెస్ట్‌.. జొమాటోలో కొత్త ఫీచర్

Published Mon, Jul 15 2024 7:03 PM | Last Updated on Mon, Jul 15 2024 7:16 PM

Zomato New Feature Delete Order

కస్టమర్ సమస్యలను పరిష్కరించే దిశగా జొమాటో ఓ కొత్త ఫీచర్ పరిచయం చేసింది. ఆర్డర్ హిస్టరీ కనిపించకుండా చేయడానికి ఇప్పుడు 'డిలీట్ ఆర్డర్' అందుబాటులో తెచ్చింది. కంపెనీ ఈ ఫీచర్ తీసుకురావడానికి గల కారణాన్ని ఈ ఇక్కడ తెలుసుకుందాం..

డిలీట్ ఆర్డర్ అనే ఫీచర్ గురించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో వివరిస్తూ.. కరణ్ సింగ్ అనే వ్యక్తి అర్థరాత్రి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారని, హిస్టరీ మొత్తం అందులో నిక్షిప్తమై ఉండటం వల్ల తన భార్యకు దొరికిపోతున్నట్లు చెప్పాడు. ఇది చాలామంది సమస్య. ఇప్పుడు మీరు ఆర్డర్ హిస్టరీని తొలగించవచ్చు. దీన్ని బాధ్యతాయుతంగా వినియోగించని అని పేర్కొన్నారు. కరణ్ సింగ్ అభ్యర్థన మన్నించి డిలీట్ ఆర్డర్ ఫీచర్ యాడ్ చేయడంతో.. సింగ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement