న్యూఢిల్లీ: అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ భారత్‌లో ప్లాంటు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. సెమీకండక్టర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్‌పై మైక్రాన్ 2.7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనితో 5,000 పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని వివరించాయి. వారం రోజుల క్రితమే ప్రాజెక్టుకు ఆమోదముద్ర లభించినట్లుగా పేర్కొన్నాయి.
కంప్యూటర్ మెమొరీ ఉత్పత్తులు, ఫ్లాష్ డ్రైవ్‌లు మొదలైన వాటిని మైక్రాన్ తయారు చేస్తుంది. సెమీకండక్టర్ల పథకాన్ని సమీక్షించి, ప్రోత్సాహకాలను పెంచిన తర్వాత మైక్రాన్ ఓసాట్ (అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్)కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. తొలి దశలో కేంద్రం నాలుగు ఓసాట్ ప్రాజెక్టులను క్లియర్ చేసింది. వీటిల్లో టాటా గ్రూప్, సహస్ర సెమీకండక్టర్స్ ప్రతిపాదనలు ఉన్నాయి. అన్నింటికన్నా ముందుగా సహస్ర ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment