ప్రేమించకుంటే చంపేస్తా..! | Boyfriend Threats to Lover on Road Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రేమించకుంటే చంపేస్తా..!

Published Thu, Oct 24 2019 6:44 AM | Last Updated on Thu, Oct 24 2019 8:34 AM

Boyfriend Threats to Lover on Road Tamil Nadu - Sakshi

బస్టాప్‌ వద్ద యువతిని కత్తితో బెదిరిస్తున్న శివకుమార్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై:  తనతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించకుంటే చంపేస్తానంటూ మాజీ ప్రేయసిని ఒక యువకుడు బెదిరించిన ఉదంతం సత్యమంగళంలో బుధవారం చోటుచేసుకుంది. ఈరోడ్‌ జిల్లా సత్యమంగళంకు చెందిన శివకుమార్‌ అదే ప్రాంతా నికి చెందిన ఓ యువతి రెండేళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ యువతి శివకుమార్‌తో మాట్లాడకుండా దూరంపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్‌ అదను కోసం వేచి చూశాడు. సత్యమంగళం పన్నారీ రోడ్డులో బుధవారం ఉదయం బస్సు కోసం వేచి ఉన్న ఆ యువతి వద్దకు వచ్చిన శివకుమార్‌ ఘర్షణకు దిగాడు. అయినా ఆమె ససేమిరా అనడంతో యువతి గొంతుపై కత్తిపెట్టి తనను ప్రేమించకుంటే హతమారుస్తానని బెదిరించా డు. ఈ సంఘటనతో బస్టాప్‌లోని వ్యక్తులు శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement