వేలూరు: ప్రియురాలిపై స్నేహితులతో కలిసి లైంగిక దాడికి యత్నించించిన ప్రియుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వేలూరు అమిర్థి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రాణిపేట జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) వేలూరులో ఉన్న ఒక కళాశాలలో చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న వేలూరు వేలపాడికి చెందిన యువకుడు(19) ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 24న ఇద్దరూ కలిసి వేలూరు సమీపంలోని అమిర్థి పార్కుకు వెళ్లారు. అనంతరం పార్కు నుంచి సుమారు 6 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ప్రియుడు తన ముగ్గురు స్నేహితులను అక్కడికి రప్పించాడు.
అటవీ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో విద్యార్థినిపై ప్రియుడితో పాటు అతని స్నేహితులు లైంగిక దాడికి యత్నించారు. దీంతో విద్యార్థిని అక్కడి నుంచి పరుగులు తీసింది. నలుగురూ ఆమెను వెంటాడారు. ఆ సమయంలో అడవిలో కట్టెలు కొడుతున్న అమిర్థి అటవీ ప్రాంతానికి చెందిన వృద్ధుడు కేకలు విని అక్కడికి వెళ్లాడు. విద్యార్థిని చిరిగిన దుస్తులతో వృద్ధుడి వద్దకు చేరుకుంది. వృద్ధుడు కేకలు వేయడంతో అటవీ ప్రాంత ప్రజలు అక్కడికు చేరుకున్నారు. నలుగురు యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ప్రియుడిని పట్టుకోగా అతని ముగ్గురు స్నేహితులు పరారయ్యారు. అతనికి దేహశుద్ధి చేసి చెట్టుకు కట్టేశారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆమెను వారికి అప్పగించారు. పరువుపోతుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం పోలీసులకు తెలియడంతో విచారణ చేస్తున్నారు. అమిర్థి అటవీ ప్రాంతానికి జంటలు వెళ్లరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment