
'కేసీఆర్ ఫాం హౌస్ వదిలి బయటకు రావాలి'
హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ఎంసెట్ -2 పేపర్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాం హౌస్ వదిలి వెంటనే సెక్రటేరియట్కు రావాలని కేసీఆర్కు సూచించారు.
ఎంసెట్ నిర్వహణలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని శివకుమార్ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని శివకుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పేపరు లీకేజీ అంశంలో బాధ్యులైన మంత్రులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.