కరీంనగర్ జిల్లాలో 32 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని... వారంతా లొంగిపోతే ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కరీంనగర్ జిల్లా ఎస్పీ శివకుమార్ తెలిపారు. జిల్లాకు చెందిన మావోయిస్టు కేకేడబ్ల్యూ దళ సభ్యుడు నంబయ్య అలియాస్ నవీన్ బుధవారం ఎస్పీ శివకుమార్ ఎదుట లొంగిపోయారు.
అనంతరం జిల్లా ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ... సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చితే కఠిన చర్యలు తప్పవని ఆయన పోలీసు ఉద్యోగులను హెచ్చరించారు. అలాగే లొంగిపోయిన మావోయిస్టులతో కలసి పోలీసులు అక్రమ దందాలు లాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహారిస్తామని అన్నారు. అవసరమైతే జిల్లా నుంచి బహిష్కరిస్తామని జిల్లా ఎస్పీ శివకుమార్ హెచ్చరించారు.