మంచిర్యాల (ఆదిలాబాద్): ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేట వద్ద శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన శివకుమార్ (30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఆటోలోని మరో నలుగురు వ్యక్తులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.