
కార్తీతో శ్రుతి
చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం మాదిరిగానే నాయికా నాయకుల కలయిక కీలకం అవుతుంది. రేర్ కాంబినేషన్ చిత్ర ప్రచారానికి ఓపెనింగ్ కలెక్షన్లకు చాలా హెల్ప్ అవుతుంది. అలా కార్తి, శ్రుతి హాసన్‌ల క్రేజీ కలయికలో ఒక చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతోందన్నది తాజా వార్త. కోలీవుడ్‌లో సీనియర్ నటుడు శివకుమార్ వారసుడు కార్తీ, అలాగే ప్రఖ్యాత నటుడు కమలహాసన్ వారసురాలు శ్రుతి హాసన్ ఈ జంట కలిసి నటిస్తే ఆ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుతాయన్నది నిజం. అలాం టి ఒక భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం కార్తీ మెడ్రాస్ చిత్రాన్ని పూర్తి చేసి ముత్తయ్య దర్శకత్వంలో కొంబన్ చిత్రం చేస్తున్నారు. శ్రుతిహాసన్, విశాల్ జంటగా పూజై చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్‌కు సై అన్న ట్లు సమాచారం. తదుపరి గోకుల్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించనున్న చిత్రంలో శ్రుతిహాసన్‌ను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హాస్య భూమికను వడివేలు పోషించనున్నారు. కార్తీ, వడివేలు మధ్య సన్నివేశాలు హాస్యపు జల్లులు కురిపిస్తాయంటున్నాయి యూనిట్ వర్గాలు.