
ఒకే చిత్రంలో ఆ ఇద్దరు
ఇద్దరు సౌందర్యరాశులు ఒకే చిత్రంలో తమ సోయగాలతో ప్రేక్షకుల్ని సుందర లోకాలకు తీసుకెళ్లి మైమరపించడానికి సిద్ధమైతే ఆ మజానే వేరు కదా! అలాంటి ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు కథానాయికలుగా యువనటుడు కార్తీ, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిల మల్టీ స్టారర్‌ల కలయికలో ఒక భారీ బ్రహ్మాండ చిత్రం తెరకెక్కితే ఆ చిత్రం క్రేజే వేరుగా ఉంటుంది. నిజంగా అలాంటి చిత్రం సెల్యులాయిడ్‌పైకి ఎక్కుతుందా?ఎందుకు రూపొందదూ?
ఇంతకు ముందు తెరకెక్కిన దళపతి, ఎందిరన్, దశావతారం లాంటి చిత్రాలు బ్రహ్మాండం కాదా. శుక్రవారం విడుదలైన బాహుబలి ఒక అద్భుత కళాఖండం కాదా? అనే పలు ప్రశ్నలు రేకెత్తే అవకాశం ఉంది. కాగా దళపతి లాంటి ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన చిత్రాన్ని తెరపై గ్రాండ్‌గా ఆవిష్కరించిన మణిరత్నం అలాంటి మరో ప్రయత్నానికి సన్నద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. నిజానికి ఇంతకు ముందే ఈ ప్రయత్నాన్ని ఆయన తలపెట్టారు.
టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, మహేశ్‌బాబు, ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ లాంటి క్రేజీ తారాగణంతో చిత్రం చేయాలని సంకల్పించారు. అనివార్యకారణాల వల్ల అది తెర రూపం జరగలేదు. ఆ తరువాత మణిరత్నం కడల్, ఓ కాదల్ కణ్మని లాంటి ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించారు. కడల్ నిరాశపరచినా,ఓ కాదల్ కణ్మని ఘన విజయం సాధించింది.దీంతో ఈ ప్రఖ్యాత దర్శకుడు ఇంతకు ముందు తలపెట్టిన భారీ చిత్రానికి తెర రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇందులో నాగార్జునకు బదులు మమ్ముట్టి,మహేశ్‌ను అనుకున్న పాత్రలో కార్తీని ఎంపిక చేసి నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.ఇక కథానాయికల విషయానికొస్తే అందానికి చిరునామా అయిన ఐశ్వర్యారాయ్,శ్రుతిహాసన్ నటించనున్నార ని సమాచారం.
ఇద్దరు సౌందర్యరాశులు ఒకే చిత్రంలో తమ సోయగాలతో ప్రేక్షకుల్ని సుందర లోకాలకు తీసుకెళ్లి మైమరపించడానికి సిద్ధమైతే ఆ మజానే వేరు కదా! అలాంటి ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు కథానాయికలుగా యువనటుడు కార్తీ, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిల మల్టీ స్టారర్‌ల కలయికలో ఒక భారీ బ్రహ్మాండ చిత్రం తెరకెక్కితే ఆ చిత్రం క్రేజే వేరుగా ఉంటుంది. నిజంగా అలాంటి చిత్రం సెల్యులాయిడ్‌పైకి ఎక్కుతుందా?ఎందుకు రూపొందదూ?ఇంతకు ముందు తెరకెక్కిన దళపతి, ఎందిరన్, దశావతారం లాంటి చిత్రాలు బ్రహ్మాండం కాదా.
కాగా దళపతి లాంటి ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన చిత్రాన్ని తెరపై గ్రాండ్‌గా ఆవిష్కరించిన మణిరత్నం అలాంటి మరో ప్రయత్నానికి సన్నద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, మహేశ్‌బాబు, ఐశ్వర్యారాయ్ లాంటి క్రేజీ తారాగణంతో చిత్రం చేయాలని సంకల్పించారు. అనివార్యకారణాల వల్ల అది జరగలేదు. ఆ తరువాత మణిరత్నం కడల్, ఓ కాదల్ కణ్మని లాంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు.
కడల్ నిరాశపరచినా, ఓ కాదల్ కణ్మని విజయం సాధించింది.దీంతో ఈ ప్రఖ్యాత దర్శకుడు ఇంతకు ముందు తలపెట్టిన భారీ చిత్రానికి తెర రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇందులో నాగార్జున బదులు మమ్ముట్టి,మహేశ్ స్థానంలో కార్తీని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.ఇక కథానాయికల విషయానికొస్తే ఐశ్వర్యారాయ్,శ్రుతిహాసన్ నటించనున్నార ని సమాచారం.