
తమన్నా స్థానంలో శ్రుతిహాసన్
త్వరలో నిర్మాణం కానున్న ఒక మల్టీస్టారర్ చిత్రంలో తమన్నా స్థానంలో శ్రుతిహాసన్ వచ్చి చేరిందనే ప్రచారం సాగుతోంది. అదీ యువ నటుడు కార్తీతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ టాక్. కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా నిర్మించనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆమె స్థానంలో శ్రుతిహాసన్ వచ్చి చేరినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
స్క్రిప్ట్ నచ్చడంతో శ్రుతి ఈ చిత్రం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ బ్యూటీ కార్తీకి జంటగా నటించనుందట. ఈ మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే హీరోయిన్లు ఎవరన్నది స్పష్టం చెయ్యలేదు. ప్రస్తుతం కార్తీ కొంభ న్ చిత్రం పూర్తి చేసే పనిలో ఉన్నారు. నాగార్జున కల్యాణకృష్ణ దరకత్వంలో ద్విపాత్రాభినయం చేయడానికి సిద్ధమవుతున్నారు. శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ అంటూ అరడజను చిత్రాలకుపైగా చేస్తోంది.