'ఊపిరి ట్రైలర్ చాలా బాగుంది' | Oopiri Official Trailer Released | Sakshi
Sakshi News home page

'ఊపిరి ట్రైలర్ చాలా బాగుంది'

Published Fri, Mar 11 2016 6:24 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

'ఊపిరి ట్రైలర్ చాలా బాగుంది' - Sakshi

'ఊపిరి ట్రైలర్ చాలా బాగుంది'

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ద్విభాషా చిత్రం 'ఊపిరి' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రం అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. యూట్యూబ్ లో విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే వేలాది మంది ఈ ట్రైలర్ ను వీక్షించారు. ఊపిరి హేగ్ ట్యాగ్ తో ట్విటర్ లో ట్రెండింగ్ అవుతోంది.

ట్రైలర్ చాలా బాగుందని అభిమానులు, సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ప్రచార చిత్రం 'అవుసమ్' గా ఉందని హీరోయిన్ ఛార్మి ట్వీట్ చేసింది.  తనకు బాగా నచ్చిందని, తాజా అనుభూతిని కలగజేసిందని రకుల్ ప్రీత్ పేర్కొంది. చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.

ఇంగ్లీషు సినిమా 'ద ఇన్ టచ్ బుల్స్' సినిమా ఆధారంగా 'ఊపిరి' తెరకెక్కింది. జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. పీవీపీ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. యువ సంగీత దర్శకుడు గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement