స్టార్ హీరోలు కూడా స్పెషల్ సాంగ్స్ చేయాలి! | Tamanna Bhatia interview | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోలు కూడా స్పెషల్ సాంగ్స్ చేయాలి!

Published Wed, Mar 16 2016 10:52 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

స్టార్ హీరోలు కూడా స్పెషల్ సాంగ్స్ చేయాలి! - Sakshi

స్టార్ హీరోలు కూడా స్పెషల్ సాంగ్స్ చేయాలి!

 ‘‘నాగ చైతన్యతో రెండు సినిమాలు చేశా. ఇప్పుడు నాగార్జునగారితో ‘ఊపిరి’ చేశా. ఇద్దరూ డౌన్ టు ఎర్త్. రెండున్నర గంటల పాటు వీల్ చైర్‌కు పరిమితమయ్యే బిలియనీర్ పాత్రను నాగార్జునగారు చేయడం నిజంగా సాహసమే. ఈ సినిమాతో ప్రేక్షకులు కూడా విభిన్నమైన కథాంశాలను ఆదరిస్తారని ప్రూవ్ అవుతుంది. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం ఉంది’’ అని తమన్నా అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పరమ్. వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ‘ఊపిరి’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమన్నా చెప్పిన ముచ్చట్లు...
 
అందరూ అనుకుంటున్నట్టు ఇది ఫ్రెంచ్ మూవీ ‘ఇన్‌టచ్ బుల్స్’కి రీమేక్ కాదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన సినిమా. నవ్విస్తూనే, మనసును తడిపే సన్నివేశాలూ ఉన్నాయి. జీవితమంటే డబ్బు అనుకునే ఓ వ్యక్తి, ఓ బిలియనీర్‌కు కేర్ టేకర్ గా చేరిన తర్వాత వాళ్లిద్దరి మధ్య స్నేహం ఎలా అల్లుకున్నదనేదే ఈ కథ. బిలియనీర్‌కు పీఏగా నటించాను. ముందు వంశీ నా లుక్ మారిస్తే 50 శాతం పని అయిపోతుందన్నారు. ఇక దుస్తులైతే చాలా టైట్‌గా ఉండేవి ఇచ్చారు. వాటితోనే నాకు ఊపిరి ఆడనంత పనైంది. కార్తీతో నాకిది మూడో సినిమా. ‘ఆవారా’, తమిళంలో ‘సిరుతెతై సినిమాలు చేశాను. కార్తీతో నటించడం అంటే రిలాక్స్ అయిపోతాను. అందుకే ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. నాగార్జునగారు తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పారు. అందరూ అనుకున్నట్లు ఈ సినిమా తమిళ వెర్షన్‌కు నేను డబ్బింగ్ చెప్పలేదు. కేవలం తెలుగులో మాత్రమే చెప్పాను. వందశాతం సంతృప్తినిచ్చిన సినిమా ఇది.
 
ప్రత్యేక పాటల గురించి ఎదురు చూడ ను. నచ్చితే గ్యారెంటీగా చేస్తాను. అయినా స్టార్ హీరోయిన్సే కాదు, స్టార్ హీరోలు కూడా ప్రత్యేక పాటలకు డ్యాన్స్ చేయచ్చు. ఎందుకంటే మన దక్షిణాదిలో కూడా మంచి డ్యాన్సర్లు ఉన్నారు కదా. స్టార్ హీరోలు ప్రత్యేక పాటలకు కాలు కదిపితే అమ్మాయిలకు పండగే (నవ్వుతూ).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement