సతీమణి విరానిక, కూతుళ్లు ఆరియానా, వివియానాలతో విష్ణు
ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూనే కెరీర్‌లో దూసుకెళ్తుంటారు హీరో మంచు విష్ణు. అయితే.. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ మరింత స్ట్రాంగ్ చేయడానికి ఓ నాలుగు రోజులు తాను అనుకున్నట్లుగా కలిసి రావాలని కోరుకుంటున్నారాయన. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. ఈ సినిమాలోని నాలుగు రోజుల సాంగ్ షూట్‌ను ఈ రోజు స్టార్ట్ చేశారు. అయితే విష్ణు భార్య విరానిక మంచు సరిగ్గా ఇది డెలివరీ టైమ్.
‘‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో సాంగ్ షూట్‌ను స్టార్ట్ చేశాం. కంప్లీట్ చేయడానికి ఫోర్ డేస్ టైమ్ పడుతుంది. నా భార్య డెలివిరీ టైమ్ దగ్గరపడుతోంది. ఎనీటైమ్ బేబీ మా ఫ్యామిలీలోకి రావాలని కోరుకుంటున్నాను. అయితే ఆ బేబి నాకోసం ఇంకో నాలుగు రోజులు వెయిట్ చేస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు విష్ణు. ఈ న్యూ ఇయర్ విష్ణుకి స్పెషల్ అని చెప్పాలి. ఆల్రెడీ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇప్పుడు ఇంకో బేబీని వెల్కమ్ చేయడానికి ఇంటిల్లిపాదీ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘ఆచారి అమెరికా యాత్ర’ను జనవరి 26న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment