మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర' | Manchu Vishnu Achari America yathra Third Schedule | Sakshi
Sakshi News home page

మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర'

Published Sun, Jul 16 2017 3:49 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర'

మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర'

మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆచారి అమెరికా యాత్ర'. దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు, నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. హైద్రాబాద్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం మలేసియాలో తాజా షెడ్యూల్ను ప్లాన్ చేశారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'మంచు విష్ణు సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్ర పోషిస్తున్నారు. విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హిలేరియస్గా నవ్విస్తుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను సమకూర్చారు. ప్రస్తుతం మలేసియా షెడ్యూల్లో భారీ క్యాస్టింగ్తో నాగేశ్వర్రెడ్డి  ఎంటర్టైనింగ్ సీన్స్ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం టీం మొత్తం అమెరికా వెళ్లనున్నాం. అక్కడ మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement