'అమ్మానాన్నలకు సారీ.. అభిమానులకు థ్యాంక్స్' | Manchu vishnu about accident | Sakshi
Sakshi News home page

'అమ్మానాన్నలకు సారీ.. అభిమానులకు థ్యాంక్స్'

Published Mon, Aug 7 2017 12:06 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Manchu vishnu about accident

మలేషియాలో ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ జరుగుతుండగా హీరో మంచు విష్ణుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు పాటు ఐసీయూలో చికిత్స పొందిన విష్ణు ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు ప్రమాదం జరిగిన సమయంలో స్పందించిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు విష్ణు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఓ చిన్న జాగ్రత్త తీసుకోని కారణంగా ప్రమాదం జరిగిందని, తన కారణంగా అమ్మానాన్న, అక్కా తమ్ముడు ఎంతో బాధపడ్డారని వారికి క్షమాపణలు తెలిపాడు. అదే సమయంలో తనను ఫోన్ చేసి, సోషల్ మీడియా ద్వారా తనుత్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రమాదం తన తప్పు వల్ల జరగలేదన్న విష్ణు, త్వరలో ప్రమాదం జరిగిన సన్నివేశం వీడియో కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు విష్ణు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement