‘అమెరికా’ జర్నీ వాయిదా! | achari america yatra cinema postponed | Sakshi
Sakshi News home page

‘అమెరికా’ జర్నీ వాయిదా!

Published Mon, Jan 22 2018 8:02 PM | Last Updated on Mon, Jan 22 2018 8:14 PM

achari america yatra cinema postponed - Sakshi

ఆచారి అమెరికా యాత్ర వాయిదా పడింది. ఈ నెల 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలరీత్యా వేసవికి వాయిదా పడినట్లు హీరో మంచు విష్ణు ట్విట్‌ చేశాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా  జనవరి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు మంచు విష్ణు సోమవారం తన ట్విటర్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు. అయితే కారణాలు మాత్రం వెల్లడించలేదు.

దేనికైనా రెడీ, ఆడోరకం ఈడోరకం లాంటి వినోదాత్మక చిత్రాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మానందం చాలా కాలంగా కమెడియన్‌గా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. మళ్లీ ఈ సినిమాతో తనేంటో చూపించాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఈ సినిమా వాయిదా పడింది.  ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిగా, సింగం3 అనూప్‌ సింగ్ థాకూర్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement