మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర' | Manchu Vishnu Next Movie Achari America Yatra | Sakshi
Sakshi News home page

మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'

Published Tue, Mar 14 2017 1:49 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'

మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'

దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల  కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న డా.మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్భంగా ఆచారి అమెరికా యాత్ర సినిమాను తిరుపతిలో ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'దర్శకుడు నాగేశ్వర్రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ మరోసారి అలరిస్తుంది. మార్చి 19న లాంఛనంగా సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రారంభోత్సవం రోజున పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement