
వైవైవీ క్రియేషన్స్ పతాకంపై సుకు పూర్వాజ్ దర్శకత్వంలో మారుతి వన్నెంరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘యు’. వివేక్ విశాల్, తరుణికా సింగ్, యామిని నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
సుకు పూర్వాజ్ మాట్లాడుతూ – ‘‘గతంలో నేను కొన్ని డెమోస్ తీశాను. అందులో ఒక దాని పేరు ‘కాలజ్ఞానం’. ఆ డెమో న్యూయార్క్, బాంబే తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుపుకుంది. ఇప్పుడు అదే కథను సినిమాగా తీస్తున్నాను. మనిషి సృష్టించుకున్న అభివృద్ధే వినాశకానికి కారణమని చెప్పబోతున్నా’’ అన్నారు. ‘‘25ఏళ్లుగా రామానాయుడు స్టూడియో, శబ్దాలయా స్టూడియోల్లో పనిచేశాను. నిర్మాతగా నాకిది తొలి సినిమా’’ అన్నారు మారుతి.
∙తరుణికా సింగ్, వివేక్ విశాల్, యామిని
Comments
Please login to add a commentAdd a comment