ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అందరూ తమ తమ హడావుడిలో పడిపోతారు. ఇకపోతే ఈ శుక్రవారం విజయ్ దేవరకొండ-సమంత 'ఖుషి' సినిమా థియేటర్లలోకి రానుంది. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అయితే ఈ వారం ఓటీటీలో మాత్రం 22 కొత్త మూవీస్- వెబ్ సిరీస్ లు రిలీజ్‌కి రెడీ అయిపోయాయి.
20కి పైగా సినిమాలు పలు ప్రముఖ ఓటీటీల‍్లో విడుదలవుతున్న వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ అయితే ఏం లేవు. డబ్బింగ్ చిత్రాలు మాత్రం రెండు ఉన్నాయి. వాటిలో 'డీడీ రిటర్న్స్' కామెడీ మూవీ కాగా, 'స్కామ్ 2003' మాత్రం ఓ మాదిరి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న వెబ్ సిరీస్. ఇంకా వీటితో పాటు లిస్టులో ఏమేం ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం.
(ఇదీ చదవండి: 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్)
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా
నెట్‌ఫ్లిక్స్
- లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 30
- మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 30
- చూజ్ లవ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 31
- వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 31
- ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ చిత్రం) - సెప్టెంబరు 01
- డిసెన్‌చాంట్‌మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01
- ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 01
- హ్యాపీ ఎండింగ్ (డచ్ సినిమా) - సెప్టెంబరు 01
- లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01
- ఈజ్ షీ ద ఊల్ఫ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 03
అమెజాన్ ప్రైమ్
- ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01
జీ5
- బియే బిబ్రాత్ (బెంగాలీ సినిమా) - సెప్టెంబరు 01
- డీడీ రిటర్న్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 01
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ఇండియానా జోన్స్ అండ్ ద డయిల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 29
- NCT 127: ద లాస్ట్ బాయ్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 30
- ద ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 01
సోనీ లివ్
- స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 01
బుక్ మై షో
- ద అల్లేస్ (అరబిక్ సినిమా) - సెప్టెంబరు 01
హెచ్ఆర్ ఓటీటీ
- నీరజ (మలయాళ సినిమా) - ఆగస్టు 28
- లవ్ ఫుల్లీ యువర్స్ వేదా (మలయాళ చిత్రం) - ఆగస్టు 29
- నానుమ్ పిన్నోరు నానుమ్ (మలయాళ మూవీ) - ఆగస్టు 30
- వివాహ ఆహ్వానం (మలయాళ సినిమా) - సెప్టెంబరు 02
Comments
Please login to add a commentAdd a comment