కొత్త ఏడాదిని సరికొత్తగా స్వాగతించాలి. అందుకే నూతన సంవత్సరంలో సినీ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త లుక్స్‌తో, కొత్త పోస్టర్స్‌తో స్వాగతం చెప్పాయి కొన్ని సినిమాలు.. ఆ వివరాలేంటో చూసేద్దాం.
♦ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’ నుంచి ప్రభాస్ స్టిల్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతికి టీజర్ ఉంటుందని సమాచారం
♦ ‘ఎఫ్ 2’తో సందడి చేశారు కో బ్రదర్స్ వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు డబుల్ ఫన్‌తో ‘ఎఫ్ 3’తో తిరిగొస్తున్నారు
♦ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో పవన్, శృతీ హాసన్ బైక్‌పై వెళుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేస్తారు
♦ రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడీ’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు
♦ ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్. ఫుల్ జోష్‌తో సీటీ కొడుతున్న స్టిల్ రిలీజ్ చేశారు
♦ శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. ఇందులో ఆయన లుక్‌ను విడుదల చేశారు.
♦ సంక్రాంతికి సందడి చేయడానికి ‘అల్లుడు అదుర్స్’తో వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు
♦ నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘వరుడు కావలెను’ పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘లక్ష్య’ లో అథ్లెట్‌లా రఫ్‌గా కనిపిస్తున్నారు నాగశౌర్య
♦ సుమంత్ ‘కపటధారి, సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’, అలీ, నరేష్ ముఖ్య పాత్రల్లో చేస్తున్న ‘అందరూ బావుండాలి అందులో మనముండాలి’, వశిష్ట సింహ, హెబ్బా పటేల్ ‘ఓదెల రైల్వేస్టేషన్’, సప్తగిరి హీరోగా చేస్తున్న ‘ఎయిట్’, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’, ‘ఆకాశవాణి’, ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్’ చిత్రాలు న్యూ ఇయర్‌కి న్యూ లుక్స్‌తో Ðð ల్‌కమ్ అన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment