
కరోనా అందర్నీ కుదిపేసింది. ఇలాంటి అనూహ్య ముప్పుని ఎవ్వరూ ఊహించలేదు. కరోనా మీద, కరోనా సమయంలో ఏర్పడ్డ సంక్షోభం మీద సినిమాలు చేస్తున్నట్టు ఆల్రెడీ పలువురు దర్శకులు ప్రకటించారు. తాజాగా కరోనా మీద మరో సినిమా ప్రకటన వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా మరికొందరు దర్శకులతో కలసి ఓ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు.
సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా, కేతన్ మెహతా, సుభాష్ కపూర్ లతో కలసి అనుభవ్ సిన్హా ఓ ఆంథాలజీ (పలు కథల నేపథ్యంలో సినిమా) చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐదుగురు దర్శకులు ఐదు కథలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అన్ని కథలూ కరోనా బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతాయని, స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అనుభవ్ సిన్హా తెలిపారు. ఈ సినిమాను ఆయనే నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ కథల్లో ప్రముఖ నటీనటులే కనిపిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment