ఓ నెటిజన్ వ్యంగ్య వ్యాఖ్యకు హీరో రానా అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అసలేం జరిగిందంటే... ‘‘నేను పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. అయినా ఆ ఫలితం నా కలలను నేరవేర్చుకునే ప్రక్రియను నిరుత్సాహపరచలేదు’’ అని రానా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ హెడ్‌లైన్‌ను ట్వీటర్‌లో పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. ‘ఎందుకంటే మా కుటుంబానికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఉంది’ (రానాను ఉద్దేశిస్తూ) అంటూ వ్యంగ్య ధోరణిలో ఓ కామెంట్‌ని ఆ పోస్ట్‌కు జోడించాడు నెటిజన్.
ఈ కామెంట్‌కు హీరో రానా తనదైన శైలిలో బదులు చెప్పారు. ‘‘నువ్వు చెప్పింది నిజం కాదు బ్రదర్. నువ్వు నటన అనే కళను నేర్చుకోకపోతే నిర్మాణ సంస్థ ఉన్నా ఏ ఉపయోగం ఉండదు. మంచి కథలను ప్రేక్షకుల మందుకు తీసుకువెళ్లడానికి చాలా నిర్మాణ సంస్థలు పని చేస్తున్నాయి’’ అంటూ, ‘నువ్వు ఒక ఫెయిల్యూర్‌వి అని ప్రపంచం అంతా అంటున్నా నీ కలలను వెంటాడు’ అని కూడా సూచించారు రానా.
ఏప్రిల్ 2న అరణ్య: రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన త్రిభాషా చిత్రం ‘అరణ్య’. తమిళంలో ‘కాడన్’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్స్‌ను పెట్టారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం.
అది నిజం కాదు బ్రదర్
Published Wed, Feb 12 2020 1:03 AM | Last Updated on Wed, Feb 12 2020 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment