English magazine
-
అది నిజం కాదు బ్రదర్
ఓ నెటిజన్ వ్యంగ్య వ్యాఖ్యకు హీరో రానా అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అసలేం జరిగిందంటే... ‘‘నేను పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. అయినా ఆ ఫలితం నా కలలను నేరవేర్చుకునే ప్రక్రియను నిరుత్సాహపరచలేదు’’ అని రానా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ హెడ్‌లైన్‌ను ట్వీటర్లో పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. ‘ఎందుకంటే మా కుటుంబానికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఉంది’ (రానాను ఉద్దేశిస్తూ) అంటూ వ్యంగ్య ధోరణిలో ఓ కామెంట్‌ని ఆ పోస్ట్‌కు జోడించాడు నెటిజన్. ఈ కామెంట్‌కు హీరో రానా తనదైన శైలిలో బదులు చెప్పారు. ‘‘నువ్వు చెప్పింది నిజం కాదు బ్రదర్. నువ్వు నటన అనే కళను నేర్చుకోకపోతే నిర్మాణ సంస్థ ఉన్నా ఏ ఉపయోగం ఉండదు. మంచి కథలను ప్రేక్షకుల మందుకు తీసుకువెళ్లడానికి చాలా నిర్మాణ సంస్థలు పని చేస్తున్నాయి’’ అంటూ, ‘నువ్వు ఒక ఫెయిల్యూర్వి అని ప్రపంచం అంతా అంటున్నా నీ కలలను వెంటాడు’ అని కూడా సూచించారు రానా. ఏప్రిల్ 2న అరణ్య: రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన త్రిభాషా చిత్రం ‘అరణ్య’. తమిళంలో ‘కాడన్’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్స్‌ను పెట్టారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం. -
తాబేలుపై నిలబడి ఫొటో, 'బుక్' అయ్యాడు
*నెహ్రూ జూపార్కులో ఘటన *అదుపులో అనుమానితుడు బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్కులోని వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి.. అక్కడి పక్షలతో ఫొటోలు దిగడంతో పాటు తాబేలుపై నిలబడి ఫొటో దిగిన దృశ్యాలు ఫేస్బుక్లో హల్చల్ చేయడంతో పాటు ఇంగ్లిషు పత్రికలో రావడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి. రామకృష్ణరావు బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.... ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టామని, ఈ ఫొటోల్లోని వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఫజల్ షేక్‌గా అనుమానిస్తూ బహదూర్‌పురా పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఫొటోలు గతేడాది జూన్,జులైల్లో దిగి ఉండవచ్చన్నారు. ఉదయం 9 - 10.30 గంటల మధ్యలో వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోని వ్యర్థ ఆహార పదార్థాలు, యానిమల్ కీపర్లు తొలగిస్తారని, ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి ఫోటో దిగి ఉండవచ్చన్నారు. జూలోని ఓపెన్ ఎన్‌క్లోజర్ మైదానంలో పక్షులతో పాటు చీతాలు ఉంటాయని, ఇక్కడ కూడా ఫజల్ షేక్ ఫొటో దిగాడన్నారు. ఈ ఘటన నేపథ్యంలో జూ పార్కులోని అన్ని ఎన్క్లోజర్ల వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశామన్నారు. వన్యప్రాణుల పట్ల సామరస్యంగా మెలగాలని లేకపోతే అటవీ యాక్ట్ కింద శిక్షకు గురవుతారనే విషయాన్ని మైక్ ద్వారా ప్రచారం చేస్తామన్నారు. కాగా, నెహ్రూ జూ పార్కులోని వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి ఫొటోలు దిగిన ఘటనలో అనుమానితుడు ఫజల్ షేక్ ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ హరీష్ కౌషిక్ తెలిపారు. -
పాత్రికేయుడు శివకుమార్ మృతి
పలువురికి శాసనసభ సంతాపం బెంగళూరు : ప్రముఖ ఆంగ్లపత్రికలో పాత్రికేయుడుగా పనిచేస్తున్న ఎన్డీ.శివకుమార్ (39) సోమవారం ఉదయం గుండెనొప్పితో వృుతిచెందారు. బెళగావి శీతాకాల సమావేశాల కవరేజ్ కోసం బెళగావికి వెళ్లిన శివకుమార్ సోమవారం ఉదయం గుండెనొప్పి రావ డంతో కేఎల్ఈ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం వృుతిచెందారు. శివకుమార్ మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సమాచారశాఖామంత్రి రోషన్‌బేగ్ ఆస్పత్రికి వెళ్లి అంతిమదర్శనం చేసుకుని తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. వృుతుడికి భార్యతో పాటు రెండేళ్ల వయసు గల కుమార్తె ఉన్నారు. ఇటీవల వృుతిచెందిన పలువురికి శాసనసభ సంతాపం మాజీ ఎమ్మెల్యే ఎంపీ.వెంకటేశ్, మహ్మద్‌సైఫ్ ఉద్దీన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీఆర్.కృష్ణయ్యర్, పాత్రికేయుడు ఎన్.డీ.శివకుమార్ తదితరులకు విదానసభ సమావేశాల్లో భావపూర్వ శ్రధ్దాంజలి అర్పించారు. సమావేశాల్లో స్పీకర్ కాగోడుతిమ్మప్ప సంతాపం ప్రకటించి వృుతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ.... ఎంపీ.వెంకటేశ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఉత్తమ సేవలందిచార ంటూ ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా మహ్మద్‌సైఫ్ ఉద్దీన్ వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడిగా ప్రజలకు సేవలందించారని తెలిపారు. యువపాత్రికేయుడు ఎన్డీ.శివకుమార్ విధినిర్వహణలో వృుతిచెందడం అత్యంత దురదృష్టకర విషయమన్నారు. ప్రతిపక్షనేత జగదీశ్‌షెట్టర్ మాట్లాడుతూ ఉత్తమ పాత్రికేయుల్లో ఎన్డీ.శివకుమార్ కూడా ఒకరని ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బాంతికి గురిచేసిందన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిచేకూర్చాలన్నారు.