ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు.. | Rana Daggubati Lost 30 Kgs For Aranya Movie | Sakshi
Sakshi News home page

ఎలా అంటే అలా

Feb 26 2020 7:50 AM | Updated on Feb 26 2020 10:38 AM

Rana Daggubati Lost 30 Kgs For Aranya Movie - Sakshi

సినిమా మొత్తం తన ఎడమ భుజాన్ని (లెఫ్ట్‌ షోల్డర్‌) పైకి లేపి నటించారు రానా

‘బాహుబలి’ చిత్రంలో బాగా బరువు పెరిగి కండలు తిరిగిన ‘భల్లాలదేవ’గా కనిపించారు రానా. ప్రస్తుతం నటించిన ‘అరణ్య’ కోసం ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు. ఇలా పాత్ర ఎలా డిమాండ్‌ చేస్తే అలా మౌల్డ్‌ అయిపోతారు. ఇక ‘అరణ్య’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో బందేవ్‌ అనే పాత్రలో కనిపిస్తారు రానా. అస్సాంలోని ఖాజిరంగా దగ్గరలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు ఆక్రమించారు. అలా కబ్జా చేసిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ప్రభు సాల్మన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, జంతువులను కాపాడే లక్ష్యంతో ఉండే బందేవ్‌ అనే వ్యక్తి నిజజీవిత పాత్రలో నటించారు రానా.

విశేషం ఏంటంటే.. ఈ సినిమా కోసం 30 కిలోలు తగ్గడమే కాదు.. సినిమా మొత్తం తన ఎడమ భుజాన్ని (లెఫ్ట్‌ షోల్డర్‌) పైకి లేపి నటించారు రానా. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’గా, తమిళ్‌లో ‘కాడన్‌’గా హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘‘ఎప్పుడూ భారీకాయంతో ధృడంగా ఉండాలనుకునే నాకు ఈ స్థాయిలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన పని. ఈ సినిమా కోసం నేను తీసుకున్న ఫిజికల్‌ ట్రైనింగ్‌ నాకొక వండర్‌ఫుల్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు రానా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement