జైపూర్ : మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టుకు షెట్‌పల్లి గోదావరి నుంచి ఒక టీఎంసీ నీరు తరలించేందుకు నిర్మిస్తున్న పైపులైన్ పనులకు రైతులు సహకరించాలని తహశీల్దార్ మేకల మల్లేశ్ కోరారు. షెట్‌పల్లి, నర్సింగాపూర్, గంగిపల్లి గ్రామ శివారులోని పొలాల నుంచి పైపులైన్ వేస్తుం డగా, భూములు కోల్పోతున్న రైతులో గురువారం అధికారులు మాట్లాడారు. షెట్‌పల్లి గ్రా మంలోని పులి బాపునకు చెందిన బోరు బావి, మరుగుదొడ్లు, మెడగొని రాజయ్య వ్యవసా య బావి పైపులైన్ నిర్మాణంలో పోతున్నాయని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో తహశీల్దార్ మల్లేశ్, సింగరేణి సివిల్ ఎస్‌ఈ సత్యనారాయణ, ఎస్టేట్ అధికారి బాలసుబ్రమణ్యం బాధితులతో మాట్లాడారు. ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం చెల్లిస్తామన్నా రు. అలాగే గంగిపల్లి శివారులోని పాలమాకుల సతీశ్‌తోపాటు మరి కొంత మంది రైతుల పొలాల నుంచి పైపులైన్ నిర్మా ణం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి పైపులైన్ పనులు చేపట్టాలని వారు కోరారు. వారితో వీఆ ర్వోలు భూమన్న, భిక్షపతి ఉన్నారు.
పైపులైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలి
Published Fri, Oct 3 2014 1:24 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement