pipeline works
-
ఉసురు తీసిన ఊర కుక్కలు
-
దారుణం: ఉసురు తీసిన ఊర కుక్కలు
సాక్షి, ములుగు: జిల్లాలోని ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో ఘోరం జరిగింది. ఊర కుక్కలు బీభత్సం సృష్టిoచాయి. ఓ చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. కర్ణాటకలోకి గుల్బార్గాకు చెందిన వలస కార్మిక కుటుంబ రామప్ప-పాకాల పైపులైన్ పనులు చేస్తోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు కంపెనీలో పనికి వెళ్లడంతో వారికోసం ఆడుకుంటూ గుట్ట పైకి వెళ్లిన ఐదేళ్ల బాలుడి చిరంజీవిపై కుక్కలు దాడికి దిగాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కార్మిక కుటుంబం 2 నెలలుగా పైపులైన్ పనులో చేస్టున్నట్టు తెలిసింది. ఇక్కడే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
6 నుంచి ‘భగీరథ’ పైప్ లైన్లు..
అధికారులతో సమీక్షలో ప్రాజెక్టు వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు సంబంధించి గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులను ఈనెల 6న అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాలని అధికారులను ప్రాజెక్టు వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశిం చారు. ఇంట్రా విలేజ్ పనుల కోసం అసిస్టెం ట్ ఇంజనీర్ స్థాయిలో రోజువారీ షెడ్యూల్ రూపొందించాలన్నారు. భగీరథ పనుల పురోగతిపై చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల ఎస్ఈల తో శుక్రవారం ఆయన సమీక్షించారు. భగీరథ ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజక వర్గంలో ఒక మండలాన్ని ఎంచుకొని, అక్కడ పని పూర్తిచేసి మరో మండలంలో పనులు ప్రారంభించాలన్నారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలతో పైప్‌లైన్ పను లు కొంత ఇబ్బందిగా మారినప్పటికీ, మైక్రో ప్లానింగ్‌తో సమస్యను అధిగమించవచ్చన్నా రు. పైప్‌లైన్ పనుల రోజువారీ స్థితిగతులు తెలుసుకోవడానికి వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. పైప్లైన్ల మెటీరియల్ నాణ్యతను తప్పని సరిగా తనిఖీ చేయించాలన్నారు. ‘వైల్డ్ లైఫ్’ ప్రాంతం నుంచి లైన్లు వద్దు ట్రాన్స్ మిషన్ పైప్‌లైన్ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని ప్రశాంత్‌రెడ్డి అన్నా రు. నెలకు 16 శాతం చొప్పున పనులు పూర్తి చేస్తేనే నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకో గలమన్నారు. ఆసిఫాబాద్, కడెం సెగ్మెంట్ల లో వైల్డ్‌లైఫ్ ఏరియా నుంచి పైప్లైన్లు వేయ కుండా కొత్త డిజైన్లు రూపొందించాలని చెప్పారు. భూపాలపల్లి జిల్లా ముళ్లకట్ట వంతెనపై నుంచి పైప్‌లైన్ వేయడానికి అనుమతి లభించిందన్నారు. -
కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం
70 శాతం పూర్తయిన ప్రధాన పైప్‌లైన్ పనులు బాన్సువాడ : మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని సింగూరు నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు అందించే పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పైప్‌లైన్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో పైప్లైన్ల విస్తరింపు పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో పైప్లైన్ల ఏర్పాటుకు పొలాలను తవ్వి పైపులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్ల నీరు సరఫరా చేయాలన్నది మిషన్ భగీరథ ఉద్దేశం. సింగూరు ప్రాజెక్టు వద్దే నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నేరుగా పైప్లైన్ల ద్వారా నీరు సరఫరా చేయనున్నారు. మిషన్ భగీరథ కోసం సింగూరు నుంచి 1.8 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల ప్రజలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల ప్రజలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందించనున్నారు. సింగూరు పథకానికి రూ. 1,350 కోట్లు, ఎస్సారెస్పీ పథకానికి రూ. 1,400 కోట్లు కేటాయించారు. సింగూరు నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లోని మండలాలకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోని మండలాలకు నీరందిస్తారు. సింగూరు ప్రాజెక్టు వద్ద ఫిల్టర్‌బెడ్ పనులు పూర్తయ్యాయి. పైప్‌లైన్, ఇంటెక్వెల్ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దే హసన్‌పల్లిలో ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిజాంసాగర్‌లో నీటి లభ్యత విషయంలో సందేహం ఉండడంతో రూ. 500 కోట్లు అదనంగా వెచ్చించి సింగూరు నుంచి పైప్‌లైన్ వేయిస్తున్నారు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్‌కు నీటి మళ్లింపు జరుగనున్నందున.. నిజంసాగర్‌లోకి నీరు పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పనులకు ఇంకా సమయం పడుతుందని భావించిన అధికారులు.. సింగూరు నుంచి పైప్‌లైన్ వేయాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు సమీపంలో డెడ్‌స్టోరేజీ వాటర్ అందేవిధంగా కాలువను తవ్వి, పుల్కల్ వద్ద నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పైప్లైన్ల ద్వారా అక్కడి నుంచి తడ్‌మనూరు వద్ద సముద్ర మట్టానికి సుమారు 590 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో సుమారు వందమీటర్ల ఎత్తులో ట్యాంకులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి విడుదల చేసే నీరు జిల్లాలోని నర్సింగ్‌రావుపల్లికి చేరుకుంటుం ది. నర్సింగ్‌రావుపల్లి నుంచి నీరు నాలు గు ప్రాంతాలకు వెళ్తుంది. జుక్కల్, బా న్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల వరకు ప్రత్యేక పైప్లైన్ల ద్వారా నీరు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూన్‌లోపు 235 గ్రామాలకు, అదే ఏడాది డిసెంబర్ చివరి నాటికి 572 గ్రామాలకు నీరందించనున్నారు. సింగూరు వద్ద వాల్వ్ ఓపెన్ చేస్తే నిజామాబాద్ జిల్లాలోని ఇంటింటికీ నీరు చేరేవిధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సాగుతున్న పైప్‌లైన్ పనులు ప్రధాన పైప్లైన్ల పనులు పూర్తి కావస్తుండడంతో, ఇక గ్రామాల్లో పైప్లైన్ల పనులు జోరందుకున్నాయి. బాన్సువాడ సమీపంలోని దుర్కి ప్రాంతంలో పైప్‌లను డంప్ చేశారు. అక్కడి నుంచే అన్ని గ్రామాలకు పైప్లైన్లు వేస్తున్నారు. అయితే రైతుల అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్టర్లు పంట పొలాల్లో తవ్వుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
సబ్సిడీ గ్యాస్‌తో ‘మిషన్’ పనులు
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న తహసీల్దార్ సిలిండర్ స్వాధీనం 6ఏ కేసు నమోదు రామగుండం : మండలంలోని పెద్దంపేట నుంచి రామగుండం వైపు మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులకు మంగళవారం ప్రధాన రహదారిపైనే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌తో ఎరక్షన్ పనులు చేపట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు స్పందించి నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సలేండ్రపాండేపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
హాంఫట్
రూ. పదిలక్షలు.. పదిరోజులు పనులు సరిగా లేక నీరు లీకేజీ తూతూ మంత్రంగా మరమ్మతులు పట్టించుకోని అధికారులు పరకాల : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన పైపులైన్ పనులు పది రోజులు గడవకముందే లీకు అయ్యాయి. పైపులైన్ లీకేజీ కావడంతో సంగం నీళ్లు భూమి పాలు అవుతుండగా మిగతా సంగం నల్లాల ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. లక్షలాది నిధులు కేటాయించి చేపట్టిన పైపులైన్ మూడు రోజుల మురిపెనంగా మారింది. పట్టణంలోని వెల్లంపల్లిరోడ్డు, సాయినగర్ కాలనీ, మల్లారెడ్డిపల్లిలో కొంతభాగానికి ఏడాది నుంచి నల్లా నీరు కరువైంది. ప్రధాన రోడ్డులోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు రోడ్డు విస్తరించారు. బస్టాండ్ సెంటర్లో రోడ్డు వేయడంతో పైపులైన్ పగిలిపోవడంతో ఆమూడు కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. అప్పటి నుంచి ప్రజలు నీటి కోసం తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా చేయడంతో అవి ఎటు సరిపోక ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు నీటి బాధను దూరం చేయడం కోసం రెండు నెలల క్రితం నీటి కరువు నివారణ కింద రూ.10 లక్షలు కేటాయించారు. పాత సీఎంఎస్ ట్యాంకు నుంచి సాయినగర్ కాలనీ, మల్లారెడ్డిపల్లి, వెల్లంపల్లి రోడ్డుకు పైపులైన్ నిర్మాణం చేపట్టారు. 730 మీటర్ల పొడవుతో చేపట్టిన పైపులైన్ నిర్మాణ పనులు పది రోజుల క్రితమే పూర్తికావడంతో కనెక్షన్ ఇచ్చారు. రెండు రోజులు నీళ్లు పోశాయో లేదో అంతలోనే పైపులైన్ లీకేజీ అయ్యింది. పశువుల సంతకు పోయే దారి పక్కనే పైపులైన్ లీకేజీ కావడంతో రోడ్డు మీద నుంచే కాల్వ మాదిరిగా పోయింది. నల్లాలు విడిచిన ప్రతిసారీ ఇదే పైపులైన్ నుంచి నీరు వృథాగా పోతోంది. కొత్త పైపులైన్ నుంచి అప్పుడే నీరు లీకేజీ కావడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. లక్షలు వెచ్చించి నిర్మాణం చేసింది లీకేజీల కోసమేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తే అధికారులు చూసి చూడనట్లు వ్యవహారించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభంలోనే లీకేజీల పర్వం మొదలైతే తరువాత ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ తప్పును మట్టిలోనే కలిపే ప్రయత్నంలో భాగంగా అదే పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టారు. లీకేజీ అయిన చోట తవ్వి సిమెంట్‌తో అతికించారు. ఇలా అస్తవ్యస్తంగా ముగించిన పనులకు బిల్లులు విడిపించేందుకు అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈ రవీంద్రనాథ్ వివరణ కోరగా కొత్త పైపులైన్ లీకేజీ అయిన మాట వాస్తవమే. అది చిన్న లీకేజీ మాత్రమే. పైపులను కలిపే సందర్భంలో జాయింట్ లూజ్ అయింది. మళ్లీ మరమ్మతులు చేయించామని తెలిపారు. -
భాగ్యనగరికి ‘కృష్ణ’మ్మ పరవళ్లు
- డిసెంబరు నాటికి కృష్ణా మూడోదశ..! - 105.5 కి.మీ మేర పనులు పూర్తి - రింగ్ మెయిన్-1 పనుల్లో ఆలస్యం - డిసెంబరు నాటికి పూర్తిచేసేందుకు జలమండలి సన్నాహాలు.. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల దాహార్తిని తీర్చే కృష్ణా మూడోదశ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. దీంతో భాగ్యనగరానికి అదనంగా నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీరు అందే అవకాశముంది. ఇప్పటికే కృష్ణా మొదటి, రెండవ దశల ద్వారా రోజువారీగా మహానగరానికి 180 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్న విషయం విదితమే. కాగా, మూడోదశ పనుల్లో సింహభాగం పూర్తవడంతో భవిష్యత్‌లో శివారు జనం దాహార్తి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 108 కి.మీ పైప్‌లైన్ పనులకు సెప్టెంబరు 23 నాటికి 105.5 కి.మీ పనులు పూర్తవడం విశేషం. మూడోదశ పనుల పురోగతి ఇలా.. ఏడాది క్రితం చేపట్టిన మూడోదశ ప్రాజెక్టును పది ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ఇందులో కృష్ణా జలాలను సిటీకి తరలించేందుకు భారీ పంప్ హౌస్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం కూడా భాగ మే. ఇప్పటి వరకు పైప్‌లైన్ పనుల్లో కేవలం 2.5 కి.మీ పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఇక పంప్‌హౌస్ పనుల్లో 90 శాతం పూర్తయ్యాయి. రిజర్వాయర్ పనులు 85 శాతం మేర పూర్తయినట్లు జలమండలి ఈఎన్సీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి డిసెంబరు నాటికి నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రూ.1217.69 కోట్ల పనులు పూర్తి మూడోదశ ప్రాజెక్టును రూ.1670 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఇందులో రూ.1500 కోట్లు హడ్కో సంస్థ నుంచి రుణంగా సేకరించారు. మరో రూ.170 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, ఇప్పటి వరకు రూ.1217.69 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వీటికి ఏజెన్సీలకు రూ.1197.27 కోట్లు బిల్లులు చెల్లించారు. మరో రూ.453 కోట్ల మేర పనులు పూర్తికావాల్సి ఉంది. రింగ్ మెయిన్-1 పనుల్లో జాప్యం మూడోదశ కింద నగరానికి తరలించే 90 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరం నలుమూలలా సరఫరా చేసేందుకు రింగ్‌మెయిన్-1, రింగ్ మెయిన్-2 పనులను చేపట్టారు. ఇందులో రింగ్ మెయిన్-1 పనుల్లో 35.8 కి.మీకి 16.600 కి.మీ పైప్‌లైన్ పనులే పూర్తయ్యాయి. రింగ్ మెయిన్-2లో 29.650 కి.మీకి గాను 28.150 కి.మీ పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. -
పైపులైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలి
జైపూర్ : మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టుకు షెట్పల్లి గోదావరి నుంచి ఒక టీఎంసీ నీరు తరలించేందుకు నిర్మిస్తున్న పైపులైన్ పనులకు రైతులు సహకరించాలని తహశీల్దార్ మేకల మల్లేశ్ కోరారు. షెట్పల్లి, నర్సింగాపూర్, గంగిపల్లి గ్రామ శివారులోని పొలాల నుంచి పైపులైన్ వేస్తుం డగా, భూములు కోల్పోతున్న రైతులో గురువారం అధికారులు మాట్లాడారు. షెట్పల్లి గ్రా మంలోని పులి బాపునకు చెందిన బోరు బావి, మరుగుదొడ్లు, మెడగొని రాజయ్య వ్యవసా య బావి పైపులైన్ నిర్మాణంలో పోతున్నాయని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తహశీల్దార్ మల్లేశ్, సింగరేణి సివిల్ ఎస్ఈ సత్యనారాయణ, ఎస్టేట్ అధికారి బాలసుబ్రమణ్యం బాధితులతో మాట్లాడారు. ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం చెల్లిస్తామన్నా రు. అలాగే గంగిపల్లి శివారులోని పాలమాకుల సతీశ్‌తోపాటు మరి కొంత మంది రైతుల పొలాల నుంచి పైపులైన్ నిర్మా ణం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి పైపులైన్ పనులు చేపట్టాలని వారు కోరారు. వారితో వీఆ ర్వోలు భూమన్న, భిక్షపతి ఉన్నారు. -
వరంగల్‌కు నీళ్లు బంద్ చేస్తాం
నగరంలో ప్రతి ఇంటికీ నీటి సరఫరా *ఆగస్టు 15న కేసీఆర్ ప్రోగ్రాం ప్రారంభం *ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టవర్‌సర్కిల్ : ఈ సీజన్లో వర్షాలు పడకుండా నీటి ఎద్దడి ఎదురైతే వరంగల్ నగరానికి ఎల్ఎండీ నుంచి చేసే నీటి సరఫరాను నిలిపివేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. నగరంలోని ఫిల్టర్‌బెడ్ సమీపంలో ప్రతీరోజు నీటి సరఫరా కోసం జరుగుతున్న పైపులైన్ పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నగరప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ యంత్రాంగం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు. నగరానికి నీటి సరఫరా అందించే ఫిల్టర్‌బెడ్‌లో 58 ఎంఎల్డీ నీటిని శుద్ధిచేసే సామర్థ్యం ఉందని, పైపులైన్ పనులు పూర్తయితే ప్రతి ఇంటికి నల్లా నీరు ప్రతీరోజు గంటపాటు సమయానుకూలంగా ఇస్తామని తెలిపారు. ప్రతి డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.7.3కోట్లతో జరుగుతున్న పైపులైన్ పనులు రెండు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. 20 సంవత్సరాల వరకు నగర నీటి సరఫరాకు ఇబ్బంది ఉండకుండా చూస్తామని స్పష్టంచేశారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కరీంనగర్ సిటీ రెనోవేషన్ (కేసీఆర్) ప్రోగ్రాంను లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. అదేరోజు ఆన్లైన్ వెబ్సైట్ ప్రారంభమవుతుందని తెలిపారు. మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్ ఏవీ.రమణ, కమిషనర్ కె.రమేశ్, ఈఈ భద్రయ్య, నాయకులు చల్ల హరిశంకర్, బోయినపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.