6 నుంచి ‘భగీరథ’ పైప్‌ లైన్లు.. | bhageeratha pipeline works from 6th march | Sakshi
Sakshi News home page

6 నుంచి ‘భగీరథ’ పైప్‌ లైన్లు..

Published Sat, Mar 4 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

6 నుంచి ‘భగీరథ’ పైప్‌ లైన్లు..

6 నుంచి ‘భగీరథ’ పైప్‌ లైన్లు..

అధికారులతో సమీక్షలో ప్రాజెక్టు వైస్‌చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌కు సంబంధించి గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్‌ పనులను ఈనెల 6న అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాలని అధికారులను ప్రాజెక్టు వైస్‌చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశిం చారు. ఇంట్రా విలేజ్‌ పనుల కోసం అసిస్టెం ట్‌ ఇంజనీర్‌ స్థాయిలో రోజువారీ షెడ్యూల్‌ రూపొందించాలన్నారు. భగీరథ పనుల పురోగతిపై చీఫ్‌ ఇంజనీర్లు, జిల్లాల ఎస్‌ఈల తో శుక్రవారం ఆయన సమీక్షించారు.

భగీరథ ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజక వర్గంలో ఒక మండలాన్ని ఎంచుకొని, అక్కడ పని పూర్తిచేసి మరో మండలంలో పనులు ప్రారంభించాలన్నారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలతో పైప్‌లైన్‌ పను లు కొంత ఇబ్బందిగా మారినప్పటికీ, మైక్రో ప్లానింగ్‌తో సమస్యను అధిగమించవచ్చన్నా రు. పైప్‌లైన్‌ పనుల రోజువారీ స్థితిగతులు తెలుసుకోవడానికి వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలన్నారు. పైప్‌లైన్ల మెటీరియల్‌ నాణ్యతను తప్పని సరిగా తనిఖీ చేయించాలన్నారు.  

‘వైల్డ్‌ లైఫ్‌’ ప్రాంతం నుంచి లైన్లు వద్దు
ట్రాన్స్‌ మిషన్‌ పైప్‌లైన్‌ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని ప్రశాంత్‌రెడ్డి అన్నా రు. నెలకు 16 శాతం చొప్పున పనులు పూర్తి చేస్తేనే నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకో గలమన్నారు. ఆసిఫాబాద్, కడెం సెగ్మెంట్ల లో వైల్డ్‌లైఫ్‌ ఏరియా నుంచి పైప్‌లైన్లు వేయ కుండా కొత్త డిజైన్లు రూపొందించాలని చెప్పారు. భూపాలపల్లి జిల్లా ముళ్లకట్ట వంతెనపై నుంచి పైప్‌లైన్‌ వేయడానికి అనుమతి లభించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement