Prashant Reddy
-
ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రి తాతా మధుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు. -
కన్నీరు పెట్టిన మంత్రి
టీఆర్ఎస్ నేత కలీం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి బుధవారం హామీ ఇచ్చారు. భీమ్‌గల్‌లో కలీం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సాక్షి, నిజామాబాద్: మండంలలోని బాబాపూర్‌లో రెండు రోజుల క్రితం హత్యకు గురైన ఖలీం కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటామని, వారికి అండగా ఉంటామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన భీమ్‌గల్ పట్టణంలోని కర్నె గల్లీలో కలీం ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఖలీం భార్య, కూతురు, కుమారుడితో పాటు, నెలల బాలుడిని చూపి దుఖం ఆపుకోలేక విలపించారు. వారిని ఓదార్చరు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చారు. వారు ఎంతటివారైనా వదిలేదిలేదన్నారు. తాను వివరాలు కనుక్కున్నానని, అధికారులు వేగంగా విచారిస్తున్నారన్నారు. ఖలీం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని ప్రయోజనాలు అందించేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. తక్షణ సాయం కింద రూ.లక్ష నగదును అందజేశారు. ఖలీం హత్యకు కారణమైన భూవివాదం విషయంలో న్యాయ పరంగా, రెవెన్యూ పరంగా సహాయం చేస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదన్నారు. స్వతహాగా ప్రొఫెషనల్ చిత్రకారుడైన ఖలీం గీస్తున్న, సగం పూర్తయిన మంత్రి వేముల చిత్రపటాన్ని మృతుడి సోదరులు మంత్రికి చూపించారు. ఖలీం తన కుటుంబానికి లేకపోయినా కాలనీవాసుల మంచి చెడ్డలు చూసేవాడన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అప్పుచేసి మరీ వేసవిలో కాలనీవాసులకు ట్యాంకర్ ద్వారా నీరు అందించాడన్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే ఖలీం మృతితో అతడి కుటుంబం వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. తామె విరాళాలు వేసి అందజేసామని కాలనీవాసులు పేర్కొన్నారు. తాను అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ వెగ్గలం రఘు, సీఐ సైదయ్య, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య ఉన్నారు. -
మెట్రో రైలు ఇక రాయదుర్గం వరకు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఇక రాయదుర్గం వరకు ప్రయాణించనుంది. ఈ నెల 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్–3లో భా గంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇక మె ట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తుతం ఈ మార్గం లో హైటెక్ సిటీ వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.5 కి.మీ మేర అన్ని పనుల పూర్తితో పాటు రైల్వే సేఫ్టీ అనుమతులు రావడంతో 29న రైలు చివరి పాయింట్ వరకు చేరుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 26, 27 తేదీల్లో మెట్రోరైల్ సేఫ్టీ అధికారి జనక్ కుమార్ ఆధ్వర్యంలో మరోసారి రైళ్లను పరిశీలించి 29న ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. భార్యతో కలిసి మంత్రి మెట్రో జర్నీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి ఎర్రమంజిల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. బంధువు ల వివాహానికి ఆయన సతీమణితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లా డి సౌకర్యాల గురించి వాకబు చేశారు. అనంతరం ఎన్వీఎస్ రెడ్డితో ఫోన్లో మాట్లాడుతూ.. సమ యం ఆదాతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న మెట్రో సిబ్బందిని అభినందించారు. -
మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఘన స్వాగతం
సాక్షి, నిజామాబాద్: వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెంతకు చేరిన కాళేశ్వరం జలాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. కాళేశ్వరం పథకం రూపకల్పనలో తానుకూడా భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతమని, ఇది ఈ జన్మకు చాలంటూ మంత్రి భావోద్వేగంతో మట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం నీరు ఎస్సారెస్పీకి చెంతకు చేరాయి. దీంతో పూజలు చేసేందుకు మంగళవారం విచ్చేసిన రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి రైతులు, అధికారులు, టీఎన్జీవోస్ నాయకులు ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ముప్కాల్, మెండోరా ఎంపీపీలు సామ పద్మ, బురుకల సుకన్య, జెడ్పీటీసీ సభ్యులు బద్దం నర్సవ్వనర్సారెడ్డి, తలారి గంగాధర్, పార్టీ బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల అధ్యక్షులు దాసరి వెంకటేశ్, సామవెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కిషన్, ఎస్సారెస్పీ అధ్యక్షుడు జాన్సుభాకర్ తదితరులులు పాల్గొన్నారు. -
ఏయే గ్రామాలకు బస్సుల్లేవు..?
సాక్షి, హైదరాబాద్: ‘వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాల గురించి మంత్రి వాకబు చేయటంతో ఉన్నతాధికారులు ఆగ మేఘాల మీద వివరాల సేకరణకు పూనుకున్నారు. డిపోలవారీగా ఆర్టీసీ బస్సు వసతిలేని గ్రామాల వివరాలు పంపాలంటూ రీజినల్, డిపో మేనేజర్లను ఆదేశించారు. యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యంలేక విద్యార్థినులు లిఫ్ట్ అడిగి పాఠశాలకు వెళ్లే క్రమం లో కొందరు అత్యాచారాలు, హత్యలకు గురైన నేపథ్యంలో రవాణాశాఖ స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సు సౌకర్యంలేని గ్రామాల గోడును కళ్ల ముందు నిలుపుతూ మూడురోజుల క్రితం ‘వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఎంపీటీసీ ఎన్నికల బిజీలో ఉన్న మంత్రి ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మతో ఫోన్లో మాట్లాడారు. సంబంధిత వివరాల గురించి వాకబు చేశారు. యుద్ధప్రాతిపదికన సాధ్యమైనన్ని గ్రామాలకు బస్సు వసతి కల్పించాలని, ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలో దీనికి సంబంధించిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. అయితే, 844 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆర్టీసీ గుర్తించింది. ఆ సంఖ్య అంతేనా, మరిన్ని గ్రామాలున్నాయా, అనుబంధ గ్రామాల పరిస్థితి ఏంటి, రహదారులు లేని గ్రామాలు, ప్రధాన రోడ్డుకు చేరువగా ఉన్న గ్రామాలు... తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఏడాదిలో 58 గ్రామాలకు... గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 58 గ్రామాలను ఆర్టీసీ బస్సులతో అనుసంధానించినట్టు ఆర్టీసీ ఆపరేషన్ ఈడీ ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం మార్చి నాటికి రాష్ట్రంలో బస్స సౌకర్యం లేని గ్రామాల సంఖ్య 902 ఉండేదని, 2019 మార్చి నాటికి ఆ సంఖ్యను 844 కు తగ్గించినట్టు పేర్కొన్నారు. వీటిల్లో 416 గ్రామాలకు రోడ్డు వసతి లేనందున వాటిని పక్కన పెట్టి, రహదారి వసతి ఉన్న 428 గ్రామాలకు సాధ్యమైనంత తొందరలో బస్సు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. హాజీపూర్ గ్రామానికి కుషాయిగూడ డిపో నుంచి ఇప్పటికే బస్సులు ఆరు ట్రిప్పుల మేర నడుస్తుండగా అదనంగా మరో ట్రిప్పు పెంచామని, యాదగిరిగుట్ట నుంచి రెండు ట్రిప్పులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. -
సకాలంలో రాని బస్సు..
సాక్షి, హైదరాబాద్: బస్సు సకాలంలో రాకపోవడంతో ఓ ప్రయాణికుడు ఎస్ఎంఎస్ ద్వారా రవాణా మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్టీసీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కరీంనగర్‌కు చెందిన శంకరయ్య, అతని కుమారుడు అరవింద్‌లు అహ్మదాబాద్ నుంచి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్‌పోర్టు నుంచి కరీంనగర్ వెళ్లాల్సిన బస్సులో ఆన్లైన్ ద్వారా వీరు టికెట్ బుక్ చేసుకున్నారు. ఉదయం పదిన్నరకు రావాల్సిన బస్సు కనిపించకపోవటంతో వారు ఎయిర్‌పోర్టులో ఉన్న ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కౌంటర్లో సిబ్బంది కూడా లేకపోవటంతో ఎస్ఎంఎస్ ద్వారా రవాణా శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే బస్సును ఏర్పాటు చేశారు. అయితే బస్సు సకాలంలో ఎందుకు రాలేదని, సిబ్బంది కౌంటర్లో ఎందుకు లేరని ప్రశ్నించిన మంత్రి ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. -
మిషన్ భగీరథకు ‘బోర్డెక్స్’ సాంకేతికత!
నీటి నిర్వహణకు బోర్డెక్స్ సహకారం తీసుకుంటామన్న ప్రశాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్ నిర్వహణకు అవసర మైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ మెట్రోపాలిటన్ యంత్రాంగం అంగీకరించిందని రాష్ట్ర తాగునీటి సరఫరా కార్పొరేషన్ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రశాంత్‌రెడ్డి.. గురువారం బోర్డెక్స్ మెట్రోపాలిటన్ అధికారులు, సాంకేతిక సంస్థల ప్రతి నిధులతో సమావేశమయ్యారు. అంతకుముందు మెట్రోపాలిటన్ నిర్వహించే మురు గునీటి శుద్ధి కేంద్రం, వరదనీటి మానిటరింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ మురుగునీటి శుద్ధికేంద్రం నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి, దాని నుంచి విద్యుదుత్పత్తి జరుగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. నగరం మధ్యలో ఉన్నా కూడా ఎలాంటి దుర్గంధం రాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యవస్థను మూసీ నది శుద్ధిలో ఉపయోగించే అంశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘ఇంట్రావిలేజ్’లో ఇతర రాష్ట్రాలకు అవకాశం
మిషన్ భగీరథపై సమీక్షలో వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఇంట్రా విలేజ్ పను లు చేయడానికి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని,రాష్ట్రంలో కాంట్రాక్టర్ల కొరత ఉన్న సెగ్మెంట్లలో వారికి అవకాశం కల్పించా లని ప్రభుత్వం భావిస్తోందని మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇంట్రా విలేజ్ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చిం చారు.ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి ప్రతి ఆవాసానికి సురక్షిత మంచినీటి ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నందున, స్థానిక కాంట్రాక్టర్లతో పాటు మిగతా రాష్ట్రాల వారికీ అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్ల అర్హతలు, గతంలో చేసిన పనులను తెలుసుకోవడానికి బిహార్, ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో పర్యటించేందుకు కన్సల్టెంట్ల బృందాన్ని పంపాలని ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. కాంట్రాక్టర్ల రిజి స్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆయన... ఇంట్రా పనులు ప్రారంభమై 45 రోజులవు తున్నా ఓహెచ్‌ఆర్‌ల నిర్మాణాలు ఊపందు కోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పాత నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇంట్రా పనుల ఆలస్యం, కాంట్రాక్టర్లు తగినంత లేకపోవడానికి సంబంధిత చీఫ్ ఇంజనీర్ వైఫల్యమే కారణమంటూ ప్రశాంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6 నుంచి ‘భగీరథ’ పైప్ లైన్లు..
అధికారులతో సమీక్షలో ప్రాజెక్టు వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు సంబంధించి గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులను ఈనెల 6న అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాలని అధికారులను ప్రాజెక్టు వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశిం చారు. ఇంట్రా విలేజ్ పనుల కోసం అసిస్టెం ట్ ఇంజనీర్ స్థాయిలో రోజువారీ షెడ్యూల్ రూపొందించాలన్నారు. భగీరథ పనుల పురోగతిపై చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల ఎస్ఈల తో శుక్రవారం ఆయన సమీక్షించారు. భగీరథ ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజక వర్గంలో ఒక మండలాన్ని ఎంచుకొని, అక్కడ పని పూర్తిచేసి మరో మండలంలో పనులు ప్రారంభించాలన్నారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలతో పైప్‌లైన్ పను లు కొంత ఇబ్బందిగా మారినప్పటికీ, మైక్రో ప్లానింగ్‌తో సమస్యను అధిగమించవచ్చన్నా రు. పైప్‌లైన్ పనుల రోజువారీ స్థితిగతులు తెలుసుకోవడానికి వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. పైప్లైన్ల మెటీరియల్ నాణ్యతను తప్పని సరిగా తనిఖీ చేయించాలన్నారు. ‘వైల్డ్ లైఫ్’ ప్రాంతం నుంచి లైన్లు వద్దు ట్రాన్స్ మిషన్ పైప్‌లైన్ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని ప్రశాంత్‌రెడ్డి అన్నా రు. నెలకు 16 శాతం చొప్పున పనులు పూర్తి చేస్తేనే నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకో గలమన్నారు. ఆసిఫాబాద్, కడెం సెగ్మెంట్ల లో వైల్డ్‌లైఫ్ ఏరియా నుంచి పైప్లైన్లు వేయ కుండా కొత్త డిజైన్లు రూపొందించాలని చెప్పారు. భూపాలపల్లి జిల్లా ముళ్లకట్ట వంతెనపై నుంచి పైప్‌లైన్ వేయడానికి అనుమతి లభించిందన్నారు. -
భళా.. భగీరథ!
► దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది: సీఎం కేసీఆర్ ► కేంద్రం అమలు చే యాలని యోచిస్తోంది ► ఇప్పటికే ఆరు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి ► వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ‘భగీరథ’ లక్ష్యం పూర్తికావాలి ► అధికారులు బాగా పనిచేస్తున్నారంటూ కితాబు సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోందని, ఆరు రాష్ట్రాలు ఇప్పటికే మిషన్ భగీరథను అధ్యయనం చేశాయని చెప్పారు. వివిధ ఆర్థిక సంస్థలు మిషన్ భగీరథకు రూ.22 వేల కోట్లు అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించాయని, మరో ఏడెనిమిది వేల కోట్ల రుణం వస్తుందని తెలిపారు. ఇంకా అవసరమైతే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తూ రాష్ట్ర గౌరవం పెంచుతున్నారని సీఎం కితాబిచ్చారు. 2017 డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ పూర్తి కావడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణం, ఇంట్లో నల్లాలు బిగించే పనులు అతి ముఖ్యమైనవిగా భావించాలన్నారు. పథకం ప్రారంభంలో ఎదురయ్యే బాలారిష్టాలను అధిగమించాలని, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయన్న సంగతిని అందరూ గుర్తించాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైపులైన్ల నిరా్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిధుల కొరత లేదని, బిల్లులు కూడా వెంటనే చెల్లిస్తున్నందున పనులు వేగంగా జరిగేలా వర్క్ ఏజెన్సీలతో మాట్లాడాలని చెప్పారు. పనులు సకాలంలో చేస్తే ప్రోత్సాహకం గ్రామాల్లో అంతర్గత పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేస్తే 1.5 శాతం ప్రోత్సాహకం (ఇన్సెంటివ్) ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. పైపులైన్లు వేసే సందర్భంలోనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా అందులోనే వేయాలని, దీనికి ఐటీ శాఖ నుంచి సాంకేతిక అంశాలపై సలహా తీసుకోవాలని సూచించారు. తక్కువ జనాభా ఉన్న ఆవాస ప్రాంతాల్లో హెచ్డీపీఈ పైపులు వేయాలా? పీవీసీ పైపులు వేయాలా? అన్న అంశంపై నిర్ణయాధికారాన్ని ఈఈలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు 365 రోజులపాటు 24 గంటలూ అందేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణ బాధ్యత కూడా ఆర్డబ్ల్యూఎస్ శాఖకే ఉంటుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, మురికి కాల్వల నిర్మాణం పనులు కూడా చేయాల్సి ఉన్నందున ఈ శాఖకు పనిభారం ఎక్కువవుతుందని, అందుకే ఆర్డబ్ల్యూఎస్ శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్లను కలిపేయాలని, అవసరాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. పని విభజన పకడ్బందీగా జరగాలన్నారు. ప్రశాంత్‌రెడ్డి మంత్రితో సమానం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి మంత్రితో సమానమని సీఎం అన్నారు. ‘‘మిషన్ భగీరథకు ప్రత్యేకంగా మంత్రి లేరు. ఆ శాఖ నా వద్దే ఉంది. వైస్ చైర్మన్‌గా నియమితులైన వేముల ప్రశాంత్‌రెడ్డికి కేబినెట్ హోదా కల్పించినం. ఆయనే మంత్రితో సమానం. అధికారులతో సమీక్షలు నిర్వహించే అధికారం ఉంది. స్వయంగా ఇంజనీర్ అయిన ప్రశాంత్‌రెడ్డి మీ శాఖ ద్వారా జరిగే పనులు పర్యవేక్షిస్తారు. ఇతర శాఖల మంత్రులు, అధికారులతో కూడా సమన్వయం కుదురుస్తారు’’ అని కేసీఆర్ చెప్పారు. -
నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు
-
నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు
విచారణ జరపాలంటూ డీజీపీకి మల్రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కబ్జాలు, అకృత్యాలకు పాల్పడ్డారని.. దీనిపై విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డీజీపీని కోరారు. ఈ మేరకు బుధవారం డీజీపీ అనురాగ్‌శర్మను కలసి పలు పత్రాలను అందజేశారు. మంచిరెడ్డి ఏడేళ్లుగా నయీమ్‌తో సంబంధాలు కొనసాగిస్తూ దళిత, గిరిజన రైతులను బెదిరిం చారని... కోట్ల విలువైన భూములను కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించారని ఆరోపించారు. రియల్ వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేశాడన్నా రు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భూములు కొన్నా, అమ్మినా మంచిరెడ్డికి తెలియకుండా జరగడానికి వీల్లేని విధంగా భయానక వాతావరణాన్ని నయీమ్ సృష్టించాడని ఆరోపించారు. ఆదిభట్లలో మంచి ఇన్ఫ్రా డెవలపర్స్‌లో ఉన్న 36.10 ఎకరాలను మంచిరెడ్డి, ఆయన అనుచరులు రైతులను బెదిరించి రిజిస్టర్ చేయించుకున్నారని.. తట్టిఖానా రెవెన్యూ పరిధిలో 325 ఎకరాల భూమిని పేదల నుంచి తక్కువ ధరకు సొంతం చేసుకున్నారన్నారు. మంచిరెడ్డి, నయీమ్ అకృత్యాలు, కబ్జాలపై సిట్‌తో విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదిభట్లలోని మంచి ఇన్ఫ్రా డెవలపర్స్ డాక్యుమెంట్, నయీమ్, రాంరెడ్డి పట్వారీ కుమారుడు నర్సింహరెడ్డి డాక్యుమెంట్, ఖానాపూర్ 67/ఇ లోని నకిలీ పాస్‌బుక్ , ప్రొసీడింగ్స్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రం కాపీలను డీజీపీకి ఇచ్చినట్లు మల్రెడ్డి తెలిపారు. -
250 మంది టీఆర్ఎస్లో చేరిక
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు గంగారెడ్డితో పాటు 250 మంది యువ కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
నిర్మల్‌లో దారుణహత్య
నిర్మల్ అర్బన్ : ఉపాధి నిమిత్తం వలస వచ్చిన మహారాష్ట్రవాసిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన నిర్మల్ పట్టణంలోని బైల్‌బజార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సీహెచ్.సురేశ్(40) నిర్మల్‌లోని బైల్‌బజార్ సమీపంలో గుడిసె వేసుకొని కొన్నేళ్లుగా కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కమ్మరి వృత్తి చే స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజూ మా దిరిగానే శనివారంరాత్రి తన గుడిసెలో కు టుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అనూహ్యరీతిలో అర్ధరాత్రి గుడిసె సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద సురేశ్ దారుణ హ త్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి గొంతు కోసి చంపారు. ఆదివారం ఉద యం పనికి వచ్చిన మేస్త్రీ భవనం వద్ద ఉన్న గొయ్యిలో మృతదేహాన్ని గమనించి ఇంటి య జమానికి, పోలీసులకు సమాచారం అందించాడు. పట్టణ సీఐ ప్రశాంత్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆదిలాబాద్ నుంచి క్లూస్‌టీంను రప్పించి, జాగిలంతో గాలించా రు. అర్ధరాత్రి మూత్ర విసర్జన కోసమని బయటకు వెళ్లిన సురేశ్ తిరిగి రాలేదని అతడి భార్య చంద్రకళ పేర్కొంది. అయితే సంఘటన స్థలంలో, మృతదేహంపై రక్తపు మరకలు లేకపోవడం, మృతదేహం పక్కనే నిమ్మకాయలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. సంఘటన స్థలంలోనే హత్య చేశారా? లేక మరెక్కడైనా చంపి ఇక్కడ మృతదేహం పడేశారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు సురేశ్ గొంతు కోసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. సురేశ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
ఇక్కడి కూరగాయలు.. విదేశాలకు
=ఎగుమతులతో రైతులకు లాభం =త్వరలో ‘ఐ-అగ్రి’ సేవలు ప్రారంభం =‘సాక్షి’తో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ప్రశాంత్‌రెడ్డి సాక్షి, హన్మకొండ: అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన హైదరాబాద్‌కు వరంగల్ కేవలం 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇక్కడ పండే కూరగాయలు, పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ఎంతో సులభం అంటున్నారు ఐ-అగ్రి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ప్రశాంత్‌రెడ్డి. వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సుకు హాజరైన ఆ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ కంపెనీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. జనవరి నుంచి వరంగల్‌లో తమ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఆ తర్వాత నాలుగు నెలల వ్యవధిలో ఇక్కడ పండే కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేయొచ్చని, తద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నా సొంతూరు అనంతపురం. కంప్యూటర్ విద్యను లండన్‌లో పూర్తి చేసిన తర్వాత స్వదేశం వచ్చి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో స్థిరపడ్డాను. కానీ, మాది వ్యవసాయ కుటుంబం కావడంతో దానిపై ఆసక్తి ఏర్పడింది. నాణ్యమైన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటే.. మనదేశంలో సరైన మార్కెట్ ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయూన్ని గ్రహించాను. ఈ రెండింటిని అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో ‘ఐ-అగ్రి’ అనే సంస్థను హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా గతేడాది ఏర్పాటు చేశాను. ఇక్కడ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొంటూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మా కంపెనీ సామర్థ్యానికి మించి ఉత్పత్తి ఉంటే... అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో ఉన్న ఇతర పేరెన్నికగల కంపెనీల దృష్టికి తీసుకుపోతున్నాం. దాంతో మన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను కల్పిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఈ పని చేపట్టినా మంచి ఫలితాలు సాధించాం. మొదటగా అనంతపురం.. మొదటగా అనంతరపురంలోని బత్తాయి రైతులతో సమావేశమై మా సలహా మేరకు పంటలు పండిస్తే మంచి ధరకు కొంటామని హామీ ఇచ్చాం. బత్తాయి పంట చేతికి వచ్చిన తర్వాత కోయడం, గ్రేడింగ్ చేయడం, భద్రపరచడం వంటి విభిన్న అంశాలపై శిక్షణ ఇచ్చాం. మా శ్రమ ఫలించింది. మొదటి ఏడాదే రూ. 30 లక్షల విలువ చేసే బత్తాయి ఉత్పత్తులను మిడిల్ఈస్ట్(గల్ఫ్) దేశాలకు ఎగుమతి చేయగలిగాం. ఆ తర్వాత నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూరగాయలు పండించే క్షేత్రాలకు మా కార్యకలాపాలను విస్తరించాం. ఆర్నేళ్ల వ్యవధిలో 1600 మంది రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తులను కొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. జనవరిలో ప్రారంభం.. జనవరి నుంచి వరంగల్‌లో మా సేవలు ప్రారంభిస్తున్నాం. నెల రోజల వ్యవధిలో ఇక్కడి నేల స్వభావం, పండే పంటలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులపై సూక్ష్మస్థాయి నుంచి వివరాలు సేకరిస్తాం. అలా గుర్తించిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్మేందుకు వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తాం. పంట వేసిన తర్వాత మొదటి దశ ఉత్పత్తి వచ్చేంత వరకు సహకారం అందిస్తాం. ఆశించిన దిగుబడి రాగానే వరంగల్ నగరంలోనే గోదాములను ఏర్పాటు చేస్తాం. ఇక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను హైదరాబాద్‌కి తరలిస్తాం. అక్కడి నుంచి విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తాం. దేశీ మార్కెట్‌తో పోల్చితే విదేశీ మార్కెట్లో గిట్టుబాటు ధర ఎక్కువగా ఉంటుంది. రైతులకు మంచి లాభాలు వస్తాయి.