Mission Bhagiratha project
-
కాళేశ్వరం, మిషన్ భగీరథపై న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులను చేపట్టారని, అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, కానీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రస్తుత రోజుల్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా మారడం విడ్డూరమే అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో పాటు అన్నారం బ్యారేజీలో సైతం లీకేజీలు ఏర్పడటం విచారకరమన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సంబంధించి ఎల్అండ్టీ తొలుత చేపడుతుందని చెప్పినప్పటికీ... ఇప్పుడు చేయనని అంటోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై న్యాయ విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని, అప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ ఉన్నప్పటికీ వృథా ఖర్చులతో మళ్లీ మిషన్ భగీరథ పనులు చేపట్టి ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిరుద్యోగులు హర్షించేవారని, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మానసికంగా ఆందోళన చెందారన్నారు. జీవో 317 ద్వారా ఉద్యోగులు నష్టపోయారని, వారికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను కలిసే సీఎం రేవంత్: నర్సిరెడ్డి పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యుడిని సీఎం కలిసే పరిస్థితే ఉండేది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపర్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయతి్నంచినా అవకాశం దక్కలేదని, ఒకసారి అవమానానికి సైతం గురయ్యానన్నారు. కానీ రేవంత్‌రెడ్డి సీఎం అయిన మరుసటిరోజే ప్రజాభవన్‌లో కలిశానని చెప్పారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని, ఈ ఐదేళ్ల కాలంలో ఇదే తరహాలో పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవు: ఉత్తమ్ బీఆర్ఎస్ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ధాన్యం ఉందా? లేదా? ఉంటే ఎక్కడుంది? అనే అంశాలకు కాగితాల్లో ఎక్కడా వివరాలు లేకపోవడం గమనార్హమని, దీనిపై సమగ్ర పరిశీలన ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. పదేళ్లలో ఈ శాఖ రూ.56 వేల కోట్ల నష్టాల్లో ఉందని చెప్పారు. రేషన్ బియ్యం చాలాచోట్ల లబ్ధిదారులకు చేరడం లేదని, దీనిపై మరింత లోతైన చర్యలు చేపడతామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ సభ్యులు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచి్చన ప్రతి హామీని నెరవేర్చాలని, మానవహక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రకటన హర్షనీయమని, భావప్రకటన స్వేచ్ఛపై సీఎం చేస్తున్న ప్రకటనలు అమలు జరిగేలా చూడాలని అన్నారు. -
‘భగీరథ’ ట్యాంక్‌పై నుంచి పడిన కార్మికుడు
ధారూరు : పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి మిషన్ భగీరథ ట్యాంకు పనుల్లో చేరాడు. 75అడుగుల పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన ధారూరు మండల కేంద్రంలోని ఈద్గా సమీపంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ఓవర్‌హెడ్‌ట్యాంకు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ధారూరులో 75అడుగుల ఎత్తులో మిషన్‌భగీరథ ఓవర్‌హెడ్‌ట్యాంకును నిర్మించారు. పనుల నిమిత్తం పైకి సర్వీస్ వైరు వేశారు. మంగళవారం రాత్రి 8గంటల వరకు విద్యుత్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్ర అమ్రావతి జిల్లా బిస్కోలి గ్రామానికి చెందిన పంకజ్(19) ఇక్కడే పనిచేస్తున్నాడు. ట్యాంకు పైన వేసిన సర్వీస్ వైరును తీసివేయాలనీ కూలీల లీడర్ అనిల్ పంకజ్‌ను ఆదేశించాడు. పంకజ్ పైకి వెళ్లి విద్యుత్ సర్వీస్ వైర్ తీసేక్రమంలో అదుపుతప్పి పైనుంచి ఒక్కసారిగా జారాడు. భయకంపితుడై పంకజ్ నిటారుగా కూర్చున్న భంగిమలో కిందకు జారి కింద ఉన్న మొరంపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ట్యాంకు పనులకు సపోర్టుగా ఇనుప రాడ్లు ఉన్నా వాటి మధ్య నుంచి రాడ్లకు తగలకుండా జారిపడ్డాడు. వెంటనే తోటి కూలీలు యువకుడిని వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇంతవరకు ట్యాంకు పనుల్లో పాల్గొన్న నలుగురు కూలీలు పైనుంచి అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయారని, పంకజ్ మాత్రం గాయాలతో బయటపడటం నమ్మలేకపోతున్నామని తోటి కూలీలు పేర్కొన్నారు. తమ కాట్రాక్టర్ అనురాగ్‌కు సమాచారం ఇవ్వగా ఆయనే వైద్యం చేయించేదుంకు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యువకుని తల్లిదండ్రులు వచ్చాక ఇవ్వవచ్చని తెలిపారు. -
‘భగీరథ’ పూర్తిచేసే ఎన్నికలకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం విషయంలో సీఎం చెప్పినట్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఎన్నికలకు వెళ్తామని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు 49 నియోజకవర్గాల్లోని 3,787 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతోందని, మిగిలిన పనులను 2018 నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలకూ భగీరథ నీళ్లిస్తామని, అవసరమైన చోట్ల కొత్త పైపులైన్లు, ఇన్‌టేక్ వెల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో మొత్తం 12 లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్లింపు, దళిత, గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ, రేషన్ దుకాణాల మూసివేతపై టీడీపీ, 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్‌ల గురించి సీపీఎం ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నానన్నారు. -
6 నుంచి ‘భగీరథ’ పైప్ లైన్లు..
అధికారులతో సమీక్షలో ప్రాజెక్టు వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు సంబంధించి గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులను ఈనెల 6న అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాలని అధికారులను ప్రాజెక్టు వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశిం చారు. ఇంట్రా విలేజ్ పనుల కోసం అసిస్టెం ట్ ఇంజనీర్ స్థాయిలో రోజువారీ షెడ్యూల్ రూపొందించాలన్నారు. భగీరథ పనుల పురోగతిపై చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల ఎస్ఈల తో శుక్రవారం ఆయన సమీక్షించారు. భగీరథ ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజక వర్గంలో ఒక మండలాన్ని ఎంచుకొని, అక్కడ పని పూర్తిచేసి మరో మండలంలో పనులు ప్రారంభించాలన్నారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలతో పైప్‌లైన్ పను లు కొంత ఇబ్బందిగా మారినప్పటికీ, మైక్రో ప్లానింగ్‌తో సమస్యను అధిగమించవచ్చన్నా రు. పైప్‌లైన్ పనుల రోజువారీ స్థితిగతులు తెలుసుకోవడానికి వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. పైప్లైన్ల మెటీరియల్ నాణ్యతను తప్పని సరిగా తనిఖీ చేయించాలన్నారు. ‘వైల్డ్ లైఫ్’ ప్రాంతం నుంచి లైన్లు వద్దు ట్రాన్స్ మిషన్ పైప్‌లైన్ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని ప్రశాంత్‌రెడ్డి అన్నా రు. నెలకు 16 శాతం చొప్పున పనులు పూర్తి చేస్తేనే నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకో గలమన్నారు. ఆసిఫాబాద్, కడెం సెగ్మెంట్ల లో వైల్డ్‌లైఫ్ ఏరియా నుంచి పైప్లైన్లు వేయ కుండా కొత్త డిజైన్లు రూపొందించాలని చెప్పారు. భూపాలపల్లి జిల్లా ముళ్లకట్ట వంతెనపై నుంచి పైప్‌లైన్ వేయడానికి అనుమతి లభించిందన్నారు.