సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం విషయంలో సీఎం చెప్పినట్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఎన్నికలకు వెళ్తామని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ సభ్యులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు 49 నియోజకవర్గాల్లోని 3,787 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతోందని, మిగిలిన పనులను 2018 నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలకూ భగీరథ నీళ్లిస్తామని, అవసరమైన చోట్ల కొత్త పైపులైన్లు, ఇన్‌టేక్ వెల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో మొత్తం 12 లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
వాయిదా తీర్మానాల తిరస్కరణ
ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్లింపు, దళిత, గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ, రేషన్ దుకాణాల మూసివేతపై టీడీపీ, 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్‌ల గురించి సీపీఎం ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment