logistic park
-
మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం కేంద్రంగా లాజిస్టిక్ రంగం అభివృద్ధికి కీలకమైన అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధితో పాటు ఎగుమతి, దిగుమతులు సులభతరం చేసేలా 110 ఎకరాల విస్తీర్ణంలో మరో ఇండ్రస్టియల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ఢిల్లీకి చెందిన ప్రముఖ సంస్థ ఆంగ్లియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐడీపీఎల్) సిద్ధమవుతోంది. విశాఖ ఎన్టీపీసీ సమీపంలో భారీ హబ్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే విశాఖపట్నంలో లాజిస్టిక్ ఎఫిషియన్సీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం (లీప్) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖలో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు (ఎంఎంఎల్పీ) ఏర్పాటు చేస్తున్నాయి. విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో లాజిస్టిక్ పార్క్‌ను నిర్మించాలని భావిస్తోంది. తాజాగా ఏఐడీపీఎల్ ఇక్కడ ఇండ్రస్టియల్ కమ్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటు ద్వారా వాణిజ్య కార్యకలాపాలు విస్తరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు మధ్య ఎన్టీపీసీకి సమీపంలో సుమారు 110 ఎకరాల్లో ఈ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇది రెండు పోర్టులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొంది. చదవండి: (అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు) ఇందులో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. స్టార్టప్‌లు, ఇతర పరిశ్రమలకు ఇందులో లీజుకు లేదా పూర్తి హక్కులతో స్థలాలను ఇస్తారు. ఈ పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి, వాటికి అవసరమైన వస్తువుల దిగుమతులకు ఇతర ప్రాంతాలపై ఆధారపడకుండా.. పక్కనే లాజిస్టిక్ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. సమీపంలో ఫార్మా సిటీ కూడా ఉండటంతో.. ఫార్మా ఉత్పత్తుల నిల్వకు మెగాసైజ్ కోల్డ్ చైన్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఈ పార్క్‌లో మౌలిక వసతులతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు ఏఐడీపీఎల్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఆంగ్లియాన్ గ్రూపు ప్లగ్ అండ్ ప్లే విధానంలో వేర్‌హౌస్, కోల్డ్ చైన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో విశాఖ, కాకినాడల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2030 నాటికి దేశంలోనే అతి పెద్ద వేర్ హౌస్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటిగా నిలిచేందుకు విశాఖపట్నం తరహా నగరాల్లో విస్తరణ కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ఎలక్ట్రికల్ లాజిస్టిక్ రంగంలో ఆంగ్లియాన్ ఒమేగా పేరుతో ఒక టన్ను బరువును మోయగలిగే బ్యాటరీతో నడిచే ఆటోలను ఉత్పత్తి చేస్తోంది. -
రాష్ట్రంలో పెట్టుబడులకు డీపీ వరల్డ్ ఆసక్తి
సాక్షి, అమరావతి: పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పారిశ్రామిక పార్కులు నిర్వహించే దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న నాలుగు పోర్టుల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతోంది. దుబాయ్ ఎక్స్పో 2020లో భాగంగా దుబాయ్ పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం డీపీ వరల్డ్ అభివృద్ధి చేసిన జెబెల్ అలీ పోర్టును పరిశీలించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎగుమతుల కోసం ఒకేసారి 10 లక్షల కార్లను నిలిపే సామర్థ్యంతో ఈ పోర్టును అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు.. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి డీపీ వరల్డ్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి మేకపాటి తెలిపారు. భారత రాయబార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ షో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రి మేకపాటి అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలను వివరించారు. రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల కల్పనలో ఉన్న ముబదల గ్రూపు, ఐటీ రంగానికి చెందిన జీ42 ప్రతినిధులు మంత్రితో సమావేశమై రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మిడిల్ ఈస్ట్ అండ్ ఫార్ ఈస్ట్ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రావ్జీ, ఏపీఐఐసీ ౖచైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, పరిశ్రమల శాఖ, ఏపీఈడీబీ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. తబ్రీవ్ ఏషియాతో ఒప్పందం దుబాయ్ ఎక్స్పో 2020లో రూ.3,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఇప్పటికే మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం, ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసేందుకు అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏషియా పరిశ్రమతో మరో కీలక ఒప్పందాన్ని కుదర్చుకుంది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీవ్ ఏషియా సీడీవో (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో–యిస్ జావియర్ బాల్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం మంత్రి అబుదాబీలోని ఉక్కు కంపెనీ కొనరస్ను సందర్శించారు. ఉక్కు తయారీ విధానాన్ని పరిశీలించారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌తో పాటు రాష్ట్రంలో ఇతర పెట్టుబడుల అవకాశాలను కొనరస్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. ఇంక్యుబేషన్ సెంటర్లు సహా వెబినార్, రోడ్ షోల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు అబుదాబీ గ్లోబల్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ ఏజీడీఎం సంసిద్ధత వ్యక్తం చేసింది. -
రాష్ట్రంలో రాచబాట.. లాజిస్టిక్ హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. దేశ తూర్పు తీరంలో రాష్ట్రాన్ని కీలకమైన లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టింది. అందుకోసం రాష్ట్రంలో నాలుగు భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల(ఎంఎంఎల్పీ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. మొదటి దశగా విశాఖపట్నం, అనంతపురంలలో ఎంఎంఎల్‌పీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణా శాఖతో ఒప్పందం చేసుకోనుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి బాటలు వేసేందుకు రూ.10,401 కోట్లతో నిర్మించిన 31 రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.11,157 కోట్లతో నిర్మించనున్న 20 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల వ్యవస్థ కల్పనలో కీలక ఘట్టానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిలవనుంది. మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట ► దేశ తూర్పు తీరంలో పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు లాజిస్టిక్ రంగమే కీలకమైందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు నెరిపేందుకు మన తీరప్రాంతం అనుకూలం. దీన్ని గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ► అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ పాలసీ 2021– 26ను తీసుకువచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల(ఎంఎంఎల్పీ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. వాటిలో రెండు ప్రాజెక్టులను కేంద్ర ఉపరితల రవాణా శాఖతో కలసి విశాఖపట్నం, అనంతపురంలలో ఏర్పాటు చేయనుంది. ► అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కాకినాడ, కృష్ణపట్నంలో మరో రెండు భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల(ఎంఎంఎల్పీ)ను నెలకొల్పనుంది. ఆ ప్రాంతాల్లో ఎంఎంఎల్‌పీల ఏర్పాటుకు అపారమైన అవకాశాలున్నాయని సీబీఆర్ఈ కన్సల్టెన్సీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ► మొదటి దశలో కేంద్ర ఉపరితల రవాణా శాఖతో కలిసి విశాఖపట్నం, అనంతపురంలలో ఎంఎంఎల్‌పీలు ఏర్పాటు చేయనుంది. లాజిస్టిక్ ఎఫీషియన్సీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం కింద పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో వీటిని ఏర్పాటు చేస్తారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖపట్నం, అనంతపురంలలో అనుకూలమైన భూములను గుర్తించింది. ఎగుమతులు, దిగుమతులకు సౌలభ్యం ► విశాఖలో ఏపీఐఐసీకి చెందిన 389.14 ఎకరాలలో లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది జాతీయ రహదారికి 8 కి.మీ దూరంలో, విశాఖ పోర్టుకు 33 కి.మీ దూరంలో ఉంది. ఈ లాజిస్టిక్ పార్క్ కేంద్రంగా విదేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు సౌలభ్యంగా ఉంటుంది. ► విశాఖపట్నంలోని 1,100 పరిశ్రమలతో పాటు ఆ జిల్లాలో ఫార్మాసిటీకి సమీపంలో ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఒడిశా, చత్తీస్ఘడ్ తదితర రాష్ట్రాల పారిశ్రామిక అవసరాలకు ఈ లాజిస్టిక్ పార్క్ కేంద్ర స్థానంగా మారనుంది. ► లాజిస్టిక్ పార్క్ కోసం గుర్తించిన ప్రాంతానికి సమీపంలో పారిశ్రామిక అవసరాల కోసం దాదాపు 9 వేల ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. దాంతో ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దాంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. భారీగా ఉపాధి అవకాశాలు ► అనంతపురంలో లాజిస్టిక్ పార్క్ కోసం ఏపీఐఐసీ 205 ఎకరాలను గుర్తించింది. ఆ ప్రదేశం కియా పరిశ్రమకు 7 కి.మీ దూరంలో, జాతీయ రహదారికి 10 కి.మీ, బెంగళూరు విమానాశ్రయానికి 142 కి.మీ దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో అనంతపురం జిల్లాలోని 2,700 పరిశ్రమలకు ప్రయోజనకరం. ఆటోమొబైల్, సౌర విద్యుత్తు, మినరల్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నికల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఈ లాజిస్టిక్ పార్క్ ఉపయోగకరంగా ఉంటుంది. ► ఈ పార్క్ కోసం గుర్తించిన భూములకు సమీపంలో పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ ఆధీనంలో 3,500 ఎకరాల భూమి ఉంది. దాంతో ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయి. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ► పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారుల అభివృద్ధిలో రాష్ట్రం సరికొత్త మైలు రాయిని చేరుకోనుంది. రాష్ట్రంలో మొత్తం రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 31 రహదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ► వీటిలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ రూ.5,740 కోట్లతో 571 కిలోమీటర్ల మేర 24 ప్రాజెక్టులు నిర్మించనుంది. ఇక జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.4,661 కోట్లతో 170 కిలోమీటర్ల మేర ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ► రూ.11,157 కోట్లతో ఇప్పటికే నిర్మించిన 20 రహదారులను సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రి గడ్కరీ సంయుక్తంగా గురువారం ప్రారంభించనున్నారు. మొత్తం మీద 51 జాతీయ రహదారుల అభివృద్ధితో రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి దిశగా మరింత వేగంతో దూసుకుపోయేందుకు మార్గం సుగమం కానుంది. రవాణా వ్యయం తగ్గింపే లక్ష్యం ► ప్రస్తుతం దేశంలో ఒక వస్తువు ధరలో 13% కేవలం రవాణా వ్యయమే ఉంటోంది. ‘ఎంఎంఎల్పీ’ల ఏర్పాటుతో సరుకు రవాణా వ్యయాన్ని 8%కి తగ్గించాలన్నది లక్ష్యం. అందుకు ‘ఎంఎంఎల్పీ’లను హైవేలు, రైల్, జల రవాణాతో అనుసంధానిస్తారు. ► ప్రస్తుతం దేశంలో సరుకు రవాణాలో 65% రోడ్డు మార్గం ద్వారానే జరుగుతోంది. ఇది ఎక్కువ వ్యయంతో కూడుకొన్నది. ఈ వ్యయం తగ్గించడానికి పారిశ్రామిక తయారీ కేంద్రాల నుంచి చిన్న వాహనాల ద్వారా సరుకును ఎంఎంఎల్‌పీలకు చేరవేస్తారు. అక్కడ నుంచి భారీ వాహనాలు లేదా చౌకగా ఉండే జల, రైల్ రవాణా ద్వారా పంపిస్తారు. ► త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసుకోవచ్చు. ఎంఎంఎల్‌పీల్లో సరుకు నిల్వకు గోదాములు, శీతలీకరణ గిడ్డంగులు, ట్రక్కులు నిలిపే బే ఏరియా, డ్రైవర్లకు వసతులు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, కస్టమ్ క్లియరెన్సులు, బల్క్ లోడింగ్ వంటి అన్ని సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. -
సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం
దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద అర్బన్ లాజిస్టిక్ పార్క్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సేఫెక్స్‌ప్రెస్ సంస్థ ఈ లాజిస్టిక్ పార్క్‌ని హైదరాబాద్ - నాగ్‌పూర్ జాతీయరహదారికి సమీపంలో నిర్మించింది. మూడేళ్ల ఈ పార్కు నిర్మాన పనులు ప్రారంభం కాగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సేఫెక్స్‌ప్రెస్ లాజిస్టిక్ పార్క్‌లో 3 లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ లాజిస్టిక్ సేవలు లభిస్తాయి. ఏకకాలంలో 50 లారీల్లో లోడింగ్ ఆన్ లోడింగ్ చేసేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. ఫార్మా, ఎలక్ట్రిక్ రంగాల్లో హబ్‌గా ఉన్న హైదరాబాద్‌కి ఈ లాజిస్టిక్ పార్కు ఉపయోగకరంగా మారనుంది. ఈ లాజిస్టిక్ పార్కు అందుబాటులోకి రావడం వల్ల మరింత వేగంగా సరుకు రవాణాకు అవకాశం ఏర్పడనుంది. -
వస్తు తయారీ కేంద్రంగా హైదరాబాద్
అబ్దుల్లాపూర్‌మెట్(హైదరాబాద్): ప్రపంచంలోని నగరాల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, వస్తు తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకుగాను నగరం చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నగరంలో తయారైన ప్రతి వస్తువును దేశంలోని అన్నిప్రాంతాలకు రవాణా చేసేందుకు లాజిస్టిక్ పార్కులు దోహదపడతాయన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో రూ.35 కోట్ల వ్యయంతో 40 ఎకరాలలో నిర్మించిన లాజిస్టిక్ పార్కును గురువారం విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం 50 లక్షల చదరపు అడుగుల గోదాములు అందుబాటులో ఉండగా, నగరం చుట్టూ ఇంకా కోటిన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో లాజిస్టిక్ పార్కుల ఆవశ్యకత ఉందన్నారు. నగరం చుట్టూ 8 రహదారులకు ఆనుకుని లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటివరకు 14 వేలకు పైచిలుకు పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులిచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఫార్మాసిటీపై అపోహలు వద్దు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, దాని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడదని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో రాజకీయపార్టీలు రాద్ధాంతాలు చేయడం మానాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ఏ ఇబ్బంది వచ్చి నా పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఫార్మాసిటీలో పనిచేసే కార్మికులు కూడా స్థానికంగానే నివాసముంటారని, అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 50 ఏళ్ల ముందుచూపుతో కేసీఆర్ ప్రణాళికలు: సబిత వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు వెలుపల ఉన్న ప్రాంతాలను కూడా హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, లాజిస్టిక్ పార్కు సీఈవో రవికాంత్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖ, జెడ్పీటీసీ సభ్యుడు బింగి దాసుగౌడ్, బాటసింగారం సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, నాయకులు క్యామ మల్లేష్‌తోపాటు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
లాజిస్టిక్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో శుక్రవారం రోజున లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వ కేంద్రం)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో కమర్షియల్ ఆపరేషన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఇబ్రహీంపట్నం ప్రస్తుతం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. హైదరాబాద్ శివారులో విస్తరించడం, ఔటర్ రింగ్‌రోడ్, అనేక కార్పొరేట్ కంపెనీలు ఇక్కడే ఇక్కడే ఏర్పడుతుండడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దేశంలో మొదటి పార్క్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలోనే బాట సింగారంలో మరో లాజిస్టిక్ పార్క్ ప్రారంభం కానుంది. ఎలిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ రానుంది. వ్యవసాయ ప్రాంతాలకు పాలమూరు రంగారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు నీటిని అందిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎనిమిది సార్లు పర్యటించాను. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్ రెడ్డి అని ఎమ్మెల్యేని పొగడ్తలతో ముంచెత్తారు. కుంట్లూర్‌లో ఎస్టీపీ నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తున్నాం. ముచ్చర్లలో ఫార్మా క్లస్టర్ రానుంది. ఫార్మా క్లస్టర్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు రానున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఎన్నో పరిశ్రమలు స్థాపించవచ్చు. మరో ఎనిమిది లాజిస్టిక్ పార్క్ లను నిర్మించనున్నాము. రెండు రైల్వే టర్మినల్స్ వస్తున్నాయి. వాటిని అనుసందానం చేసుకోని పరిశ్రమలు స్థాపించాలి. లాజిస్టిక్ పార్క్‌ల స్థాపనకు మన నగరం అగ్ర భాగంలో ఉంది. మనందరం కోరుకునేది అభివృద్ధి కనుక కొత్త పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చినపుడు మనందరం స్వాగతించాలని' కేటీఆర్ అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీపీపీ మోడ్‌లో నిర్మించిన మొదటి లాజిస్టిక్ పార్క్ ఇది. జిల్లాలోని మున్సిపాలిటీలకు మరిన్ని నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్ రెడ్డి మాట్లాడుతూ.. లాజిస్టిక్ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో ఉన్న ఒక్కో మునిసిపాలిటీకి రూ. పది కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. పరిశ్రమలు స్థాపించడానికి ఇక్కడ అనువైన స్థలాలు ఉన్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మెన్ అనితా రెడ్డి , ఎండీ ఆంకాన్ మాట్లాడుతూ.. జిల్లా వాతావరణం చాలా బాగుంటుంది. లాజిస్టిక్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్పూర్తితో తక్కువ కాలంలోనే పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇందులో ట్రక్ డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ లాజిస్టిక్ పార్క్‌ల ఏర్పాటువల్ల ఇంకా అనేక కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయన్నారు. -
తెలంగాణలో తొలి ఇంటేగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ప్రారంభం
-
‘ఫ్లిప్‌కార్ట్’లో భారీగా ఉద్యోగాలు
బెంగళూరు : లాజిస్టిక్స్ సెక్టార్... ఏ దేశ అభివృద్ధిలోనైనా దీని పాత్ర అమోఘం. ఇటీవల కాలంలో భారత్‌లో ఈ రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. 2014 నుంచి వరల్డ్ బ్యాంకు లాజిస్టిక్స్ ఫర్ఫార్మెన్స్లో భారత ర్యాంకు 19 స్థానాలు పైకి ఎగిసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 35 మల్టి-లెవల్ లాజిస్టిక్స్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు గతేడాదే ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఫ్లిప్‌కార్ట్ లాజిస్టిక్స్ పార్క్‌ను కర్నాటకలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 4.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నట్టు పేర్కొంది. దీని కోసం బెంగళూరు శివారులో 100 ఎకరాల భూమిని కూడా ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయబోతున్నట్టు తెలిసింది. ఈ ప్రాజెక్టులో తాము వందల మిలియన్లను పెట్టుబడులుగా పెట్టనున్నామని, దీంతో మొత్తంగా వ్యయాలను తగ్గించుకుని, డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్ లాజిస్టిక్ ఆర్మ్ ఈకార్ట్ అధినేత అమితేజ్ జా తెలిపారు. ఏ ఈ-కామర్స్ వ్యాపారానికైనా లాజిస్టిక్స్ అనేవి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చాక తమ లాజిస్టిక్ వ్యయాలు 20 శాతం తగ్గుతాయని, డెలివరీ సమయం కూడా 50 శాతం తగ్గిపోతుందని తెలిపారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్ భారీగానే ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించనుందని, ప్రత్యక్షంగా 5వేల ఉద్యోగాలను, పరోక్షంగా 15వేల ఉద్యోగాలను కల్పించనుందని చెప్పారు. కొత్త పెట్టుబడులు ఆకర్షణ మాత్రమే కాక,నిర్మాణం, కనెక్టివిటీ ద్వారా గ్రామీణాభివృద్ధి కూడా చేపట్టవచ్చన్నారు. ఈ ప్రాజెక్ట్ తొలి దశను ఫ్లిప్‌కార్ట్ 2019 మధ్యలో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగ, త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద రిటైలర్ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది. -
‘భగీరథ’ పూర్తిచేసే ఎన్నికలకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం విషయంలో సీఎం చెప్పినట్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఎన్నికలకు వెళ్తామని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు 49 నియోజకవర్గాల్లోని 3,787 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతోందని, మిగిలిన పనులను 2018 నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలకూ భగీరథ నీళ్లిస్తామని, అవసరమైన చోట్ల కొత్త పైపులైన్లు, ఇన్‌టేక్ వెల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో మొత్తం 12 లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్లింపు, దళిత, గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ, రేషన్ దుకాణాల మూసివేతపై టీడీపీ, 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్‌ల గురించి సీపీఎం ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నానన్నారు. -
రంగారెడ్డి జిల్లాలో భారీ లాజిస్టిక్ పార్కు
సాక్షి, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో భారీ లాజిస్టిక్స్ పార్క్‌కు మంత్రులు కె.తారకరామారావు, మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 22 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పార్కులో సుమారు 750 ట్రక్కులను అంకన్ పార్క్ లో ఉంచడానికి వీలుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ట్రక్కుల సిబ్బందికి విశ్రాంతి గదులు, హాస్పిటల్ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. పార్కింగ్ కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించారని తెలిపారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో బాటసింగారంలో రూ. 35 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో మరో లాజిస్టిక్స్ పార్కును కూడా నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, పార్క్ ఎం.డి రాజశేఖర్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్
సాక్షి, న్యూఢిల్లీ: సాగర్మాల కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఏడు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్పీ)లను ఏర్పా టు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజ స్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వీటిని నెలకొల్పనున్నారు. దేశవ్యాప్తంగా సరుకు రవాణా తీరుతెన్నులను అధ్యయనం చేసి పారిశ్రామిక క్లస్టర్లకు అందుబాటులో ఉండేలా ఆయా ప్రాంతాల ను గుర్తించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో ఒక ఎంఎంఎల్పీ అందుబాటులోకి వచ్చిందని కేంద్రానికి కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్) తెలి పింది. తెలంగాణలోని నాగులపల్లిలో 60 ఎకరాల్లో .. ఇప్పటికే 16 ఎకరాల్లో రూ.120 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధిలక్ష్యంగా కేంద్రం సాగర్మాల రూపొందించిన సంగతి తెలిసిందే. -
అంతుబట్టని లాజిక్!
వల్లూరు లాజిస్టిక్ పార్కు భూములకు అడ్డగోలుగా నష్టపరిహారం పంపిణీ రెవెన్యూ మంత్రి వరకూ ఫిర్యాదులు బాధితులకు లభించని ఊరట అనకాపల్లి: వల్లూరు లాజిస్టిక్ పార్కు కోసం సేకరించిన భూములకు ఏ ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించారో అంతుబట్టని వ్యవహారంగా మారింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము వేసే ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆర్థిక వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ వివాదం ఇప్పుడు స్వయంగా రెవెన్యూ మంత్రి దృష్టికి కూడా వెళ్లింది. సుమారు 374 మంది లబ్ధిదారులను మూడు కేటగిరీల్లో గుర్తించి 286 ఎకరాల భూమిని రెవెన్యూ యంత్రాంగం సేకరించింది. ఈ భూమి ఏపీఐఐసీ ద్వారా పోర్టుట్రస్టుకు దఖలుపరిచే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అంతు చిక్కని పీటముడి : ప్రస్తుతం వల్లూరు లాజిస్టిక్ పార్కు భూసేరణ అనంతరం నష్టపరిహారం తంతు ముగిసినా ఇంకా వేధిస్తున్న ఒక చిక్కుముడి ఇప్పుడు అధికారుల్ని, రైతుల్ని, దళారుల్ని వెన్నాడుతోంది. చినికిచినికి గాలి వానలా మారిన ఈ ఆర్థిక వివాదం ఒక ఎమ్మెల్యే, కీలకమైన అధికారులు, రెవెన్యూ మంత్రి దృష్టికి కూడా వెళ్లింది. ఏమిటా చిక్కుముడి?: వల్లూరు లాజిస్టిక్ పార్కు భూసేకరణకు ముందు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి ఇద్దరు రైతుల నుంచి సుమారు మూడెకరాల డీపట్టా భూమిని 99 సంవత్సరాలకు లీజుకు తీసున్నాడు. అప్పటికే ఆ భూమిని అసలు రైతు దగ్గర నుంచి మరో మహిళ కొనుగోలు చేశారు. అప్పట్లో వల్లూరు డీ పట్టా భూములకు పెద్దగా విలువ లేకపోవడంతో భూముల క్రయవిక్రయాలను ఎవరూ పెద్దగా పట్టించుకొనే వారు కాదు. ఇప్పుడు ఎకరాకు 14 లక్షల 75 వేల రూపాయిల నష్టపరిహారం రావడంతో ఆర్థిక వివాదాలు పెరిగిపోయాయి. నష్టపరిహారం అసలు రైతుల ఖాతాలో పడిపోవడంతో అధికార పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. బ్యాంకు నుంచే సదరు నష్టపరిహారాన్ని తన ఖాతాలోకి మళ్లించుకొని భూమిని కొనుగోలు చేసిన వారికి అం దించి ఒరిజినల్ డాక్యుమెంట్లు తెస్తానని నమ్మబలికాడు. తీరా భూమిని లీజుకి తీసుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి నష్టపరిహారం అందకపోవడంతో వివాదం మొదలయింది. లీజుకి తీసుకున్న భూమి లాజిస్టిక్ పార్కులో పోవడం, పైసా నష్టపరిహారం అందకపోవడంతో ఆ ఉద్యోగి ఈ వివాదాన్ని విశాఖ సిటీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు, రెవెన్యూ ఉన్నతాధికారులకు, చివరకు రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీవో లేఖ రాసినా..? ఈ వివాదం రెవెన్యూ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆర్డీవో రంగంలోకి దిగి స్థానిక తహశీల్దార్‌కు సమస్య పరిష్కరించాలని లేఖ రాశారు. అయినప్పటికీ బాధితులకు ఊరట లభించలేదు. ఎందుకో ఉలికిపాటు : అనకాపల్లి మండలంలోని వల్లూరు భూసేకరణ నష్టపరిహార వివాదం ఒక రెవెన్యూ అధికారికి ఉలికిపాటు కలిగిస్తోంది. ఆర్థిక లావాదేవీలపై కాల్‌మనీ కేసు పెడతామని, ప్రొబెషనర్ ఆఫ్ ట్రాన్స్ఫర్(పీవోటీ) యాక్ట్ ప్రయోగించి కేసు పెడతామని భూములు దక్కించుకున్న స్టీల్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. చట్టం, నిబంధనల వరకూ బాగానే ఉన్నా ఈ ఉదంతంలో వల్లూరు భూసేకరణ తీరునే ప్రశ్నించే అనేక అనుమానాలు ఇప్పుడు అందరి మదిలో తలెత్తుతున్నాయి. వీటికి సమాధానం ఎవరు చెబుతారు? ఒరిజినల్ పట్టాలు లేకుండానే నష్టపరిహారం ఎలా మంజూరయింది? భూములు సర్వే చేసిన సర్వేయర్ అక్కడ ఒరిజినల్ పట్టాలు లేకుండానే ఎలా గుర్తించారు? ఒక వేళ డీపట్టా ఒరిజినల్ లేకపోయినా డూప్లికేట్ తయారు చేసి ఉంటే ఇలా అన్నింటికి ఇదే తరహా తతంగాన్ని నడిపారా? బ్యాంకులోని రైతు ఖాతా నుంచి లక్షల్లో పరిహారం మధ్యవర్తికి ఎలా బదిలీ అయింది? రెవెన్యూ మంత్రి నుంచే సిఫారసు వచ్చిందంటే ఈ వివాదంలో విశ్వసనీయత లేనట్లా..? ఎవరికి కాపాడేందుకు.. ఏ రహస్యాన్ని దాచేం దుకు ఈ తతంగం? -
బడుగులపై లాజిస్టిక్ !
లాజిస్టిక్ పార్కు ట్రెంచ్ పనులు అడ్డుకునేందుకు యత్నించిన పేదలు ఆందోళనకారులపై లాఠీచార్జి 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉపాధి కోసం...భవిష్యత్‌పై భరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్న బడుగులపై లాఠీ విరిగింది... కడుపు మంటతో ఆందోళనకు దిగిన అభాగ్యులపై పోలీ సులు తమ ప్రతాపం చూపించారు... తమకు న్యాయం చేయాలని వల్లూరులో ఆందోళనకు దిగిన భూమిలేని నిరుపేదలపై ఒక్కసారిగావిరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేశారు... దొరికినవారిని దొరికినట్టు దౌర్జనంగా వ్యాను లో ఎక్కించి అక్కడినుంచి తరలిం చారు. ఇద్దరు మహిళలు స్ఫృహతప్పి పడిపోగా, మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో వల్లూరులో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. అనకాపల్లి:అనకాపల్లి మండలంలోని వల్లూరు రెవెన్యూ పరిధిలో 286 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ ద్వారా రంగం సిద్ధమైంది ఢీ-పట్టా, 4(సీ), ఆక్రమిత భూములుగా విభజించి మూడు కేటగిరీలలో నష్టపరిహారాన్ని మంజూరు చేశారు. ప్రస్తుతం నష్టపరిహారం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యే దశలో ఉండగా, ఏ భూమి లేని రెండువందల మంది తమను కూడా ఆదుకోవాలని కోరుతూ పోరాటం ప్రారంభించారు. కొప్పాక హైవేపై దీక్షలు, తహశీల్దార్ కార్యాలయం ముందు వంటా వార్పు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రాలను సమర్పించినా ఫలితంలేకపోయింది. దీంతో పదిరోజుల క్రితం తహశీల్దార్‌ను ముట్టడించారు. నాలుగు రోజుల క్రితం ఎరుకువానిపాలెం రహదారిలో తహశీల్దార్‌ను అడ్డుకొని న్యాయం చేయమని వేడుకున్నారు. రెవెన్యూ యంత్రాంగం సోమవారం ఆర్డీవో సమక్షంలో గ్రామ సభ నిర్వహించి ఎటువంటి నష్టపరిహారం రాదని ప్రకటించారు. అయినా ఆశ వీడని 200 మంది వల్లూరు లాజిస్టిక్ పార్కు బాధితులు... మంగళవారం చేపట్టిన ట్రెంచ్ పనుల్ని అడ్డుకోబోయారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు రూరల్ సీఐ నేతృత్వంలోని 150 మంది పోలీసులు ఆందోళన కారులపై విరుచుకుపడ్డారు. మహిళలున్నారని కూడా చూడకుండా విచక్షణా రహితంగా లాఠీఛార్జీ చేశారు. ఆయా ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దొరికినవారిని దొరికినట్టు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానుల్లో ఎక్కించి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో పాల్గొన్న వల్లూరు, గొర్లెవానిపాలెం, రాజుపాలెం, ఎరుకువానిపాలెం వాసులను అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. గ్రామీణపోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు గైపూరి పైడితల్లమ్మ , కసిరెడ్డి సన్యాసమ్మలు స్ఫృహతప్పి పడిపోవడంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహానికి గురై ఎమ్మెల్యే పీలా గోవింద, తహశీల్దార్ భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలుచేశారు. సృ్పహతప్పి పడిపోయిన మహిళల్ని వంద పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
వల్లూరు లాజిస్టిక్ బాధితుల అరెస్టు
లాజిస్టిక్ పార్కు వల్ల ఉపాధి కోల్పోయిన తమకు ప్యాకేజీ ప్రకటించాలని ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా వల్లూరులో మంగళవారం ఉదయం జరిగింది. లాజిస్టిక్ పార్కు వల్ల తాము ఉపాధి కోల్పోయామయని తమకు ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. -
భూ స్వాధీనాన్ని అడ్డుకున్న రైతులు
అనకాపల్లి: విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి భూ స్వాధీనాన్ని అనకాపల్లి మండలం వల్లూరులో రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. మండల పరిధిలో 400 ఎకరాల్లో పార్క్ ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణను అధికారులు పూర్తి చేశారు. అయితే, పరిహారం మాత్రం పరిహారం ఇంకా అందలేదు. ఈ నేపథ్యంలో భూ స్వాధీనానికి వచ్చిన లాజిస్టిక్ పార్క్ ప్రతినిధులను సుమారు 400 మంది రైతులు గ్రామంలో అడ్డుకున్నారు. అందరికీ పూర్తిగా పరిహారం ఇచ్చాకే స్వాధీనానికి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అలాగే, పరిహారం విషయంలో కొందరు రైతులకు అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అఖిలపక్ష నేతలు, రైతులతో తహశీల్దార్ భాస్కర్‌రెడ్డి చర్చలు మొదలు పెట్టారు.