భూ స్వాధీనాన్ని అడ్డుకున్న రైతులు | farmers dharna due to land pooling for logistic park | Sakshi
Sakshi News home page

భూ స్వాధీనాన్ని అడ్డుకున్న రైతులు

Published Fri, Nov 13 2015 1:18 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

farmers dharna due to land pooling for logistic park

అనకాపల్లి: విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి భూ స్వాధీనాన్ని అనకాపల్లి మండలం వల్లూరులో రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. మండల పరిధిలో 400 ఎకరాల్లో పార్క్ ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణను అధికారులు పూర్తి చేశారు. అయితే, పరిహారం మాత్రం పరిహారం ఇంకా అందలేదు. ఈ నేపథ్యంలో భూ స్వాధీనానికి వచ్చిన లాజిస్టిక్ పార్క్ ప్రతినిధులను సుమారు 400 మంది రైతులు గ్రామంలో అడ్డుకున్నారు.

అందరికీ పూర్తిగా పరిహారం ఇచ్చాకే స్వాధీనానికి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అలాగే, పరిహారం విషయంలో కొందరు రైతులకు అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అఖిలపక్ష నేతలు, రైతులతో తహశీల్దార్ భాస్కర్‌రెడ్డి చర్చలు మొదలు పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement